pizza
నిన్న ' లెజెండ్ ' ఇప్పుడు ‘లయన్‌’ ఆడియో లహరి మ్యూజిక్ ద్వార విడుదల కావడం అదృష్టంగా బావిస్తున్నాను
- 'లహరి మ్యూజిక్' అదినేత జి. మనోహర్ నాయుడు
You are at idlebrain.com > news today >
Follow Us

04 April 2015
Hyderabad

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘లయన్‌’ ఆడియో రైట్స్ ని ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ ఆడియో ఏప్రిల్‌ 9న అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబునాయుడు చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు సత్యదేవ దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతం లో బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్ వచ్చిన ఎన్నో చిత్రాల ఆడియో అమ్మకాలు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. మళ్లి ఇన్నాలకు అదే కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లయన్‌’. ఈ ఆడియోను ఏప్రిల్‌ 9న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా పలువురు సినీ , రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత భారీ స్థాయిలో ‘శిల్పకళా వేదిక’లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి .మనోహర్ నాయుడు మాట్లాడుతూ... ‘మా సంస్థ ద్వార గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణగారు నటించిన ' లెజెండ్ ' ఆడియో మేమే రిలీజ్ చేసాము. చిత్రం తో పాటు మా ఆడియో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాటలు గాని. డైలాగ్స్ గాని డిజిటల్ డౌన్ లోడ్స్ బాగా జరిగాయి. మళ్లి ఈ ఏడాది ‘లయన్‌’ ఆడియో తో శ్రోతల ముందుకు రానున్నాం . బాలకృష్ణ`మణిశర్మ కాంబినేషన్‌లో వస్తున్న మరో మ్యూజికల్‌ సెన్సేషనల్‌ హిట్‌ ‘లయన్‌’.

‘లెజెండ్‌’ వంటి లెజెండరీ హిట్‌ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో నందమూరి అభిమానుల్లో ‘లయన్‌’ ఆడియో పై భారీ అంచనాలుండడం సహజమే. వారి అంచనాలను మించే స్థాయిలో ‘లయన్‌’ ఆడియో కూడా ఉండబోతోంది’.

బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌గా పేర్కొనే` ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాల ఆడియోలకు నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో విచ్చేసి` సదరు ఆడియోను విడుదల చేశారు, మళ్లీ ఇప్పుడు ఆయన మరోమారు ముఖ్యమంత్రిగా ‘లయన్‌’ ఆడియోను విడుదల చేయనున్నారు.

సో, సెంటిమెంట్‌ పరంగా చూసుకొంటే.. ‘లయన్‌’ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు! అదే మాదిరిగా లహరి మ్యూజిక్ సెంటిమెంట్‌గా ‘లయన్‌’ ఆడియో కూడా నిలుస్తుందని బావిస్తున్నాను. ఈ ఆడియో హక్కులు మాకు ఇచ్చి ప్రోస్చాహించిన నిర్మాత రుద్రపాటి రమణారావు గారికి ధన్య వాదాలు " అన్నారు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved