24 October 2016
Hyderabad
In its illustrious journey over the years, the prestigious label that has been associated with a number of successful films is Lahari Music.
Megastar Chiranjeevi's 150th film 'Khaidi No. 150', Nandamuri Balakrishna's 100th film 'Gautamiputra Satakarni', and Prabhas' magnum opus 'Baahubali-2' are three of the most-awaited, biggest films to be coming from Tollywood. They will all hit the marquee in the first half of next year. While there was an intense competition to secure the audio rights of these Tollywood's historic projects, Lahari Music is proud to announce that it has successfully acquired the rights.
G. Manohar Naidu, the label's director, says, "The music of 'Master', 'Hitler', 'Mechanic Alludu', 'Mutha Mestri', 'Apathbandhavudu', 'Gharana Mogudu', 'Rowdy Alludu', 'Gang Leader' and 'Mugguru Monagallu' was released through our label. And we are very happy to have secured the music rights of Chiranjeevi garu's 150th movie. We take this opportunity to extend our sincere thanks to Chiranjeevi garu, VV Vinayak garu, Ram Charan garu and Devi Sri Prasad garu."
"Balakrishna garu's 100th film is another audio which our label has acquired. It was Lahari which released the music of 'Legend', 'Lion', 'Lorry Driver', 'Nari Nari Naduma Murari', 'Rowdy Inspector', 'Ashwamedham', 'Nippu Ravva', 'Bangaru Bullodu' and 'Mitrudu'. Now, we have acquired the music rights of 'Gautamiputra Satakarni', one of the most prestigious films to be coming out from Tollywood. We take this opportunity to thank Balakrishna garu, Krish garu, producers Jagarlamudi Saibaba garu, Rajeev Reddy garu, Bibo Srinivas garu and music director Chiranthan Bhatt garu."
"It's 'Baahubali-The Beginning' which has catapulted Tollywood's stamina to the international stage. The Rajamouli magnum opus became an international sensation, exceeding everybody's expectations. With the first part becoming a humongous hit, expectations about the stamina of 'Baahubali-2' are naturally very high. The First Look, released on the eve of Prabhas' birthday, has been getting a huge reception all over. With this, already high expectations from Keeravani garu's music have skyrocketed further."
"Lahari Music has bought the audio rights of 'Baahubali-2' by offering a never-heard-before figure to the makers! It was Lahari which released the audio of 'Billa' and 'Darling'. After 'Baahubali', we have proudly acquired the rights of the second edition. 'Swaravani' Keeravani garu has given a number of hits in Telugu, Tamil and Hindi over the years. He received the National Award (Best Music) for 'Annamayya'. We are happy to be associated with the music of such a phenomenal talent."
"We thank Rajamouli garu, Keeravani garu, Sri Valli garu, producers K Raghavendra Rao garu, Shobu Yarlagadda garu, Prasad Devineni garu for encouraging us throughout."
"Lahari is going to release many more prestigious audios in near future. We will let the details out appositely. We thank the Telugu film industry, friends and the media for constantly supporting us in our endeavours."
లహరి మ్యూజిక్ ద్వారా ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, బాహుబలి 2...ఈ మూడు భారీ చిత్రాల ఆడియోలు విడుదల..!
దక్షిణ భారత దేశంలో ఎన్నో ఏళ్ళ నుండి ఆడియో రంగం లో ఉండి, ఎన్నో విజయవంతమైన చిత్రాల ఆడియోలను ప్రేక్షకులకు అందించిన ప్రతిష్టాత్మక ఆడియో సంస్థ లహరి మ్యూజిక్. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్ధాయిగా నిలిచేలా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150, నందమూరి నట సింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ మూడు చిత్రాలు వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే..
ఈ మూడు చిత్రాల ఆడియోల పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఆడియో రైట్స్ విషయంలో భారీ పోటీ ఏర్పడింది. అయినప్పటికీ ప్రముఖ ఆడియో సంస్థ లహరి మ్యూజిక్ ఈ మూడు భారీ చిత్రాల ఆడియో రైట్స్ దక్కించుకోవడం విశేషం.
ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ....చిరంజీవి గారి సినిమాలు మాస్టర్, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముఠామేస్త్రి, ఆపధ్భాంధవుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోను, చిరంజీవి కెరీర్ లోను ప్రతిష్టాత్మకమైన చిరంజీవి గారి 150వ చిత్రం ఖైదీ నెం 150 చిత్రం ఆడియో రైట్స్ ను కూడా మా లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా చిరంజీవి గార్కి, వినాయక్ గార్కి, రామ్ చరణ్ గార్కి, దేవిశ్రీప్రసాద్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
ఇక మా సంస్థ దక్కించుకున్న మరో ప్రతిష్టాత్మకమైన చిత్రం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ గారు నటించిన లెజెండ్, లయన్, లారీ డ్రైవర్, నారి నారి నడుమ మురారి, రౌడీ ఇన్ స్పిక్టెర్, అశ్వమేధం, నిప్పురవ్వ, బంగారు బుల్లోడు, మిత్రుడు చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోను, బాలకృష్ణ గారి కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రమైన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియోను కూడా మా సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గార్కి, క్రిష్ గార్కి, నిర్మాతలు జాగర్లమూడి సాబాబు గార్కి, రాజీవ్ రెడ్డి గార్కి, బిబో శ్రీనివాస్ గార్కి, సంగీత దర్శకుడు చిరంతన్ భట్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రెండు చిత్రాల తర్వాత లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ కానున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి 2. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన సంచలన చిత్రం బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందిన బాహుబలి ఎవరూ ఊహించని విధంగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం విశేషం. దీంతో బాహుబలి 2 ఏరేంజ్ లో ఉంటుందో..? ఎంత కలెక్ట్ చేస్తుందో..? అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన బాహుబలి 2 ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభించింది. దీంతో బాహుబలి 2 సినిమాతో పాటు ఆడియో ఏస్ధాయిలో ఉండబోతుందో అనే ఇంట్రస్ట్ తో ఆడియో పై క్రేజ్ మరింత పెరిగింది.
తెలుగు సినిమా చరిత్ర లో ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఇవ్వని ఫాన్సీ రేట్ తో బాహుబలి, బాహుబలి 2 ఆడియో రైట్స్ ను మా సంస్థ దక్కించుకుంది. ప్రభాస్ నటించిన డార్లింగ్, బిల్లా చిత్రాల ఆడియోలను లహరి మ్యూజిక్ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు బాహుబలి, బాహుబలి 2 ఆడియోలను కూడా మా సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్వరవాణి కీరవాణి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ కి మ్యూజిక్ అందించారు. అంతే కాకుండా అన్నమయ్య చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. జాతీయ స్ధాయిలో పేరు సంపాదించిన కీరవాణి గారు సంగీతం అందించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాల ఆడియోను మా సంస్ధ ద్వారా రిలీజ్ చేస్తుండడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
ఈ ఆడియో రైట్స్ మాకు ఇచ్చి ప్రోత్చాహించిన రాజమౌళి గార్కి , కీరవాణి గార్కి , శ్రీ వల్లి గార్కి, నిర్మాతలు కె రాఘవేంద్ర రావు గార్కి, శోభు యార్లగడ్డ గార్కి, ప్రసాద్ దేవినేని గార్కి ధన్యవాదాలు. ఈ మూడు ప్రతిష్టాత్మక చిత్రాల ఆడియోలు మా లహరి సంస్థ దక్కించుకోవడం గర్వంగా వుంది. భవిష్యత్ లో మరిన్ని ప్రతిష్టాత్మక చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారా రిలీజ్ చేయనున్నాం. ఆ వివరాలను త్వరలో తెలియచేస్తాం. మాకు ఎంతగానో సహకరిస్తున్న తెలుగు ఇండస్ట్రీకి, మిత్రులకు, మీడియాకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాం అన్నారు.