pizza
Lakshmi Bomb in Post production work
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `లక్ష్మీ బాంబ్`
You are at idlebrain.com > news today >
Follow Us

16 October 2016
Hyderaba
d

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా....

మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ''చాలెంజింగ్‌ పాత్ర చేస్తున్నాను. ఎగ్జయిటింగ్‌ సబ్జెక్ట్. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్‌ క్యారెక్టర్‌ జడ్జ్ పాత్రలో కనపడతాను సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాంముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ ఆధ్వర్యంలో చేశాం. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను బాగా తెరకెక్కించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అన్నారు.

చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ''పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో, మంచి ఎమోషన్స్ తో లక్ష్మీ బాంబ్ సినిమాను రూపొందించాం. అనుకున్న ప్లానింగ్ లో సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచు లక్ష్మీగారిని చాలా కొత్త రకంగా ప్రజెంట్ చేసే సినిమా. ఫైట్స్, సాంగ్స్ హైలెట్ అవుతాయి. మంచి టీం కుదిరింది. సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశాం. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించిన పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా గ్రాఫిక్స్ వ‌ర్క్‌తో పాటు రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. మంచు ల‌క్ష్మిగారి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేయ‌గ‌లిగ‌లిగాం. నిర్మాతలు సురేష్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి దీపావళి సందర్భంగా మా లక్ష్మీ బాంబ్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘‘ అన్నారు.

పోసానికృష్ణ మురళి, హేమ, ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్‌, రాజాబాబు, శరత్‌, శ్రీహర్ష, విశాల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్‌ రెడ్డి, డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: నందమూరి హరి, పాటలు: కరుణాకర్‌,కాసర్లశ్యామ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, కథ, మాటలు: డార్లింగ్ స్వామి, లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్‌.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved