pizza
Laos Motion pictures production No-1 shooting completed
షూటింగ్ పూర్తి చేసుకున్న లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ !
You are at idlebrain.com > news today >
Follow Us

10 September 2017
Hyderabad

Laos Motion pictures has completed the shooting of it maiden movie production last Friday at Rama Naidu Studios. Esther Noronha, Noel Sean, Sri Mangam and Arjun Anand are playing the lead roles in this movie. Kranthi Kumar Vadlamudi, worked as assistant to SS Rajamoui for movie like Eega, Maryadha Ramanna and Magadheera is being introduced as the director with this movie.

Speaking to media on this occasion director Kranthi said “we worked for a year on the script. The script was reviewed by industry specialist at multiple stages and their valuable feedback was incorporated into the script. After we were completely satisfied with the script and had bound script on hand we started shooting the movie. We are completely satisfied with the output. Every scene will uphold the suspense and do justice to the suspense thriller theme of the movie. The story, screen play and photography is going to definitely stand out and will give a different experience to the audience for sure”

Also Sree Ram Kandukuri, one of the producers of the movie said “While we come from IT back ground our passion from childhood days towards movies have lead us to movie production. We are happy that we could complete the shooting of the movie successfully. Post production of the movie is in full swing, we have already completed dubbing and editing, Color grading, Re-Recording and Visual effects are in progress. We are making all arrangements to release the movie this November. The title of the movie is already registered and we will announce it soon in appropriate way. Stay tuned to us.”

The technical team incudes - DOP Chetan Maduranthakam, Music Geetha Poonik, Art Ramesh, Production controller Chowdhary, Production Manager Mohan Rao, Costume Designer Ajab Ali Akber, Story Laos Motion Pictures, Writing Team Time Naani, Ravi Kiran, Producers Ram Kethu, Sree Ram Kandukuri, Krishna Mohan and Naren Lebaku, Screen play and direction Kranthi Vadlamudi.

షూటింగ్ పూర్తి చేసుకున్న లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ !

లావోస్ మోషన్ పిక్చర్స్ ప‌తాకంపై రూపొందుతున్న మొదటి సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో న‌టిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వ‌ద్ద ఈగ, మర్యాద రామన్న , మగధీర చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవ‌ల పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రాంతి కుమార్ వ‌డ్ల‌మూడి మాట్లాడుతూ... “ బౌండ్ స్క్రిప్ట్ తో షూటింగ్ మొదలుపెట్టి స్క్రిప్ట్ లో వున్నా ప్రతి చిన్న ఎలిమెంట్ ను తెరకెక్కిచాడానికి సహకరించిన నటీ నటులకి , సాంకేతికవర్గానికి, నిర్మాతలకి నా కృతజ్ఞతలు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపధ్యం తో సాగే ఈ చిత్రం లో ప్రతి సన్నివేశం ప్రేక్షకులని థ్రిల్ కి గురి చేస్తుంది. కథ ,కథనం,ఛాయాగ్రహణం లో చూపించిన వైవిధ్యం మారుతున్న ప్రేక్షకుల ఆంచనాలని అందుకుంటుందని ``అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన శ్రీ రామ్ కందుకూరి మాట్లాడుతూ....``గురువారం రామానాయుడు స్టూడియో లో జరిగిన ప్యాచ్ వర్క్ తో సినిమా నిర్మాణం పూర్తైంది. మాకు కొత్తయిన, దర్శకుడు క్రాంతి, నటీ నటుల , సాంకేతికవర్గం సహకారంతో సినిమా సాఫీగా పూర్తవడం జరిగింది. ఎడిటింగ్ డ‌బ్బింగ్ పూర్తైంది. ప్రస్తుతం రీ- రికార్డింగ్ , కలర్ గ్రేడింగ్ , విజువల్ ఎఫెక్ట్స్ పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్ చేయ‌నున్నాం`` అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా చేతన్ మధురాంతకం , సంగీతంః గీత పూనిక , ఆర్ట్ఃర‌మేష్ , ప్రొడక్షన్ కంట్రోలర్ః చౌదరి , ప్రొడక్షన్ మేనేజర్ః మోహ‌న్ రావు , పిఆర్ఓః కుమార‌ స్వామి , కాస్ట్యూమ్ డిజైనర్ః అజ‌బ్ , రచన సహకారంః టైం నాని , రవి కిరణ్ , కథః లావోస్ మోషన్ పిక్చర్స్ , నిర్మాతలుఃరామ్ కేతు, కృష్ణ మోహన్ , శ్రీ రామ్ కందుకూరి , నరేన్ లేబాకు, స్క్రీన్ ప్లే - దర్శకత్వంః క్రాంతి కుమార్ వడ్లమూడి.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved