pizza
LAOS Motion pictures production No. 1 news
You are at idlebrain.com > news today >
Follow Us

14 November 2015
Hyderabad

లావోస్ మోషన్ పిక్చర్స్ లవ్ స్టోరీ..

నూతన నటీనటులు, సాంకేతిక నిపుణుల సారధ్యంలో జి.సుమన్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చెస్తూ నరేంద్ర కుమార్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి లు లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఓ సరికొత్త ప్రేమకధా చిత్రాన్ని నిర్మించనున్నారు..

అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి దర్శకుడు సుమన్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకత్వం మీద మక్కువ తో 2006 లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నేను బి.ఏ.జయ, ఇవివి సత్యనారాయణ, రమేష్ వర్శ, శ్రీనివాస రెడ్డి, సాయికిషోర్ ల వద్ద దర్శకత్వ శాఖలో వర్క్ చేయటం జరిగింది.చాలా సినిమాలకు మాటలను కూడా అందించటం జరిగింది. ఇక దర్శకుడిగా ఓ అందమైన ప్రేమకధ ను నూతన నటీనటులు, సాంకేతిక నిపుణుల కు అవకాశమిస్తూ సినిమాను చెయనున్నాను.. ఏలాంటి అశ్లీలతకు తావు లేకుండా కుటుంబ మంతా కలిసి చూడదగ్గ చిత్రంగా మా సినిమాకు తెరమీదకు తీసుకురానున్నాము.. నా కధ నచ్చి నా స్నేహితులు నరేంద్ర కుమార్ రెడ్డి , శ్రీరామ్ ఈ చిత్తాన్ని నిర్మిస్తున్నారు..నరేంద్ర కుమార్ రెడ్డి యుఎస్ లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నారు శ్రీరామ్ రెడ్డి బయో టెక్నాలజీ రంగంలో శాస్త్రవేత్త గా స్థిరపడ్డా విలువలతో కూడిన సినిమాలను తియ్యాలని సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.. డిసెంబర్ చివరి వారంలో చిత్రోకరణ ప్రారంభించి కర్నూల్, వైజాగ్, హైదరాబాద్ లొ షూటింగ్ జరుపతాము.. పూర్తి వివరాలు త్వరలోనే తెలియ చెస్తామన్నారు..

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved