pizza
Lavanya Tripathi interview (Telugu) about Radha
నాకు పోలీసులంటే భ‌యం లేదు! - లావ‌ణ్య త్రిపాఠి
You are at idlebrain.com > news today >
Follow Us

09 May 2017
Hyderabad

తొలి చిత్రం `అందాల రాక్ష‌సి`తోనే తెలుగు వారి హృద‌యాల్లో చోటు సంపాదించుకుంది లావ‌ణ్య త్రిపాఠి. ఈ భామ ఆ త‌ర్వాత చేసిన సినిమాలు కూడా ప్రేక్ష‌కుల మెప్పు పొందిన‌వే. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`, `సోగ్గాడే చిన్నినాయ‌న‌`, అల్లు శిరీశ్‌తో చేసిన `శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు`.. ఆ కోవ‌లోనివే. ఈ ఏడాది ఈ మ‌ధ్య‌నే `మిస్ట‌ర్‌`లో న‌టించిన ఈ భామ త్వ‌ర‌లోనే `రాధ‌` చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుంది. ఆ సినిమాలోని విశేషాల‌ను లావ‌ణ్య త్రిపాఠి మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడింది..

* `రాధ‌`లో మీరేనా రాధ‌?
- హా హా హా.. ఇందులో ఇద్ద‌రు రాధ‌లున్నారు. హీరో పేరు రాధ‌. నా పేరు కూడా రాధ. హీరోలో కృష్ణుడి పోలిక‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి.

* మీ పాత్ర గురించి చెప్పండి?
- ఈ సినిమాలో నేను కాలేజ్ స్టూడెంట్‌గా న‌టించాను. నా పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. లుక్ వైస్‌, సాంగ్స్, యాక్టింగ్‌, బిహేవియ‌ర్‌ అంతా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఆర్టిస్ట్ లాగా ఉంటుంది. ఇందులో నాకు మాస్ సాంగ్ ఉంది. క్లాసిక‌ల్ సాంగ్ కూడా ఉంది. చాలా బావుంటుంది.

* మోడ్ర‌న్ ట‌చ్ ఉన్న రోల్ చేశారా?
- అవునండీ. ఇందులో కామెడీ కూడా చేశాను. అది సిట్చువేష‌న‌ల్ కామెడీ. చాలా వైవిధ్యంగా క‌నిపిస్తాను.

* కామెడీ చేయ‌డం క‌ష్టంగా అనిపించిందా?
- అదేం లేదండీ. ఎందుకంటే నేను చేసిన కామెడీ ఫోర్స్డ్ గా ఉండ‌దు. సిట్చువేష‌న‌ల్‌గా ఉంటుంది.

* ఎలా ఉంది మీ కెరీర్‌..
- చాలా హ్యాపీగా ఉన్నా. వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా.

* `రాధ‌`లో మిమ్మ‌ల్ని అట్రాక్ట్ చేసిన విష‌యం ఏంటి?
- ఈ సినిమాలో ఒక ట్విస్ట్ నాకు చాలా బాగా న‌చ్చింది. స‌స్పెన్స్ ఉంటుంది. డ్రామా కూడా ఉంటుంది. చాలా ఇంట్ర‌స్టింగ్ క‌థ‌.
హీరోని స‌పోర్ట్ చేస్తాను. రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది. కామెడీ ఉంటుంది. ఎమోష‌న్ ఉంటుంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మిది.

* శ‌ర్వానంద్‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- త‌ను చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌తాడు. నేను చాలా ఎక్కువ‌గా మాట్లాడేదాన్ని. త‌న‌తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. త‌నతో ప‌నిచేయ‌డానికి ప్ర‌తి హీరోయిన్ ఇష్ట‌ప‌డుతుంది. త‌ను చాలా మంచి వ్యక్తి. ప్రొఫెష‌న‌ల్‌. ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్ శ‌ర్వా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాడు. ఆఫ్ స్క్రీన్‌లో త‌ను చాలా షైగా ఉంటాడు. కానీ త‌న ఆన్‌స్క్రీన్ పెర్ఫార్మెన్స్ బెస్ట్ గా ఉంటుంది.

Lavanya Tripathi interview gallery

* పోలీసు సినిమాలో న‌టించ‌డం ఎలా ఉంది?
- నాకు పోలీసులు కొత్త కాదు. మా నాన్న‌గారు లాయ‌రు. మా సిస్ట‌ర్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌. త‌న స్నేహితులు ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌లున్నారు. కాబ‌ట్టి నాకు పోలీసులు కొత్త కాదు.

* న‌టుల‌తోనే కొత్త‌గా అనిపిస్తోందా?
- న‌ట‌న కొత్తేమో కానీ.. క‌ళ‌లు మాకు కొత్త కాదు. మా ఇంట్లో అంద‌రూ ఆర్టిస్ట్ లే. మా అమ్మ స్టిచ్చింగ్స్ వంటివి చేస్తారు. మా సిస్ట‌ర్ స్కెచెస్ చాలా బాగా వేస్తుంది. త‌ను క‌థ‌క్ నేర్చుకుంది. మా బ్ర‌ద‌ర్ కూడా ఆర్టిస్టే. మా సిస్ట‌ర్ ఎప్పుడూ చ‌దువుతూ ఉండేది. నేను ఆర్టిస్ట్ కాక‌పోయి ఉంటే ఫ్యాష‌న్ డిజైన‌ర్ అయ్యేదాన్ని.

* మిస్ట‌ర్‌కి, ఈ సినిమాలోని పాత్ర‌కీ ఏంటి తేడా?
- చాలా తేడాలున్నాయి. అందులో బ్లాంక పేప‌ర్‌లాంటి అమ్మాయిని. మొబైల్ అంటే ఏంటో కూడా తెలియ‌దు. ఇందులో న్యూ
ఏజ్ గ‌ర్ల్.. కాలేజ్ గ‌ర్ల్స్ హోమ్‌లో చాలా నైస్‌గా ఉంటారు. కానీ బ‌య‌టికి వెళ్తే విశ్వ‌రూపం చూపిస్తారు. నేను కూడా ఈ చిత్రంలో అలాంటి పాత్ర చేశా.

* ఇంట్లో వాళ్లు మిమ్మ‌ల్ని ఆంక్ష‌లు పెట్టిన సంద‌ర్భాలున్నాయా?
- అబ్బే లేవండీ. మా ఇంట్లో న‌న్నెవ‌రూ అర‌వ‌రు. నేను చాలా కూల్‌గా ఉంటాను. ఎప్పుడూ ఎవ‌రినీ విసిగించ‌ను.

* ఫెయిల్యూర్‌ని ఎలా తీసుకుంటారు?
- బిఫోర్ రిలీజ్ ఎలా ఉన్నానో, నేను ఆఫ్ట‌ర్ రిలీజ్ కూడా అలాగే ఉంటాను. ఎందుకంటే జ‌యాప‌జ‌యాలు న‌న్ను ఏమీ చేయ‌వు. భ‌లే భ‌లేమ‌గాడివోయ్ చిత్రానికి ముందు నేను క‌నీసం నా సినిమా రిలీజ్ రోజు ఫోన్ కూడా స్విచ్చాన్ చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మా ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. నా న‌ట‌న‌ను నేను ప్రేమించి చేశాను క‌దా.. అలాంట‌ప్పుడు నేనెందుకు బాధ‌ప‌డాలి? అనే అంశాన్ని తెలుసుకున్నా.

* ఇప్ప‌టిదాకా ఎన్ని సినిమాలు చేశారు?
- నేనెప్పుడూ లెక్క‌లు వేసుకోలేదండీ. ఒక 50 సినిమాలు అయ్యాక ఏమైనా ఆలోచిస్తానేమో..

* కొత్త ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
- మా సినిమా ద‌ర్శ‌కుడు పేరుకు కొత్త‌వాడే కానీ, ఈ సినిమాను ఆయ‌న మ‌న‌సులో ఇప్ప‌టికే ప‌ది సార్లు చూసుకుని ఉన్నారు. అందుకే ఆయ‌న ఎక్క‌డా త‌డ‌బ‌డ‌రు. అంతా చాలా కూల్‌గా చేసుకుంటూ వెళ్లారు. చాలా ఫోక‌స్డ్ ప‌ర్స‌న్‌.

* గ‌త సినిమాల విజ‌యం ప్ర‌భావం మీ మీద ఉంటుందా?
- ఉండ‌దండీ. ఎందుకంటే ప్ర‌తి సినిమానూ మొద‌లుపెట్ట‌డానికి ముందు న‌న్ను నేను జీరో చేసుకుంటాను. ప్ర‌తి చిత్రాన్నీ కొత్త‌గానే భావించి మొద‌లుపెడ‌తాను. నేను డైర‌క్ట‌ర్‌కి స్టూడెంట్‌లాగానే బిహేవ్ చేస్తా. లేకుంటే క‌ష్టం.

* స‌మ‌ర్ వెకేష‌న్ కి ఎటు వెళ్తున్నారు?
- నాకు తీరిక లేదండీ. ప్ర‌స్తుతం నేను చైత‌న్య సినిమా చేస్తున్నా.

* ముందు తండ్రితో ఆ త‌ర్వాత త‌న‌యుడితోనా..?
- నేను ముందు కొడుకుతోనే చేశాను. మ‌నం లో ఒక చిన్న రోల్ చేశాను క‌దా. ఆ త‌ర్వాతే నాగ్ సార్‌తో చేశాను. ఇప్పుడు మ‌ర‌లా చైత‌న్య‌తో చేస్తున్నాను. సో ప్రేక్ష‌కులు న‌న్ను ఈ ర‌కంగా ఆశీర్వ‌దిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

* మీ నిర్మాత గురించి చెప్పండి?
- నేను చాలా ల‌క్కీ. చాలా మంచి నిర్మాత‌ల‌తో ప‌నిచేస్తున్నా. అల్లు అర‌వింద్‌, బాబీ, టాగూర్ మ‌ధు, ప్ర‌సాద్ వంటివారంద‌రితో చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ ప్రొడ్యూస‌ర్‌ బాబీ సార్ అమేజింగ్. త‌న‌తో ఇంకో సారి ప‌నిచేయాల‌ని ఉంది. ప్ర‌సాద్‌గారితో చాలా హ్యాపీ. సెట్స్లో చాలా ఫ‌న్నీగా ఉండేవారు.

* మీ గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటి?
- కాన్ఫిడెన్స్ అంటే.. అంత‌కు మించి ఏమీ కాదు.ఎవ‌రైనా హ్యాపీగా ఉంటేనే అందంగా ఉంటారు. హ్యాపీనెస్ కీ ఇంకెవ‌రి ద‌గ్గ‌రా ఉండ‌దు. మ‌న ద‌గ్గ‌రే ఉంటుంది. స్కిన్ డాక్ట‌ర్ల చేతిలో అస‌లు ఉండ‌ద‌ని న‌మ్మాలి.

* మీకు స‌క్సెస్ రేట్ ఎక్కువ క‌దా..
- 90 శాతం స‌క్సెస్ రేట్ అనే విష‌యాన్ని నేను ప‌ట్టించుకోను. నాకు చాలా పెద్ద అచీవ్‌మెంట్ వ‌చ్చినా అది నాకు త‌ల‌కెక్క‌దు. . నేను అచీవ్‌మెంట్స్ వ‌చ్చినా నా రియాక్ష‌న్ ఉండ‌దు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved