pizza
Lawrence choreographs for Khaidi No. 150
మెగాస్టార్ - లారెన్స్ క‌ల‌యిక‌లో మ‌రో డ్యాన్సింగ్ ట్రీట్‌..
You are at idlebrain.com > news today >
Follow Us

13 October 2016
Hyderaba
d

Mega Star and Raghava Lawrence to team up once again

When we talk about dance in Tollywood, Mega Star Chiranjeevi's name will come first in the list. He lured his fans with his mesmerizing dance steps. In 90's Mega Star Chiranjeevi is only hero who can do any type of dance.

Presently, Mega Star is busy with his on-going film 'Khaidi No. 150' and currently he is in dancing mood. He is ready to shake his legs with Lakshmi Rai in a huge set at Annapurna Studios. Popular dance master, Raghava Lawrence will be composing electrifying steps for this energetic tune composed by Devi Sri Prasad. According to makers, this song will be one of the major highlight in this film.

Mega Star and Raghava Lawrence together has delivered many super hit songs in their career. 'Nadaka Kalisina' song from 'Hitler', 'Dayi Dayi Damma' and 'Kodithe Kottalira' song from 'Indra' are one of the super hit songs in their career. Now after many years, Both Mega Star and Raghava Lawrence are teaming up once again to deliver one more energetic blockbuster song in this film.

Other than Songs and few scenes, whole shooting of this film is completed. Post production work is going on at brisk pace and movie is slated for release for Sankranthi, 2017. Kajal Agarwal is doing the female lead role and VV Vinayak is directing this action entertainer film. Mega Power Star Ram Charan is bankrolling this film under Konidela Production company banner.

మెగాస్టార్ - లారెన్స్ క‌ల‌యిక‌లో మ‌రో డ్యాన్సింగ్ ట్రీట్‌..

డ్యాన్సుల్లో కొత్త ఒర‌వడి సృష్టించిన బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్ ఎవ‌రు? అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే త‌ల‌చుకుంటారు. అన్న‌య్య స్టెప్పుల్లో ఎన‌ర్జీ.. ఆ హుషారు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 90ల‌లో అస‌లు బ్రేక్ డ్యాన్స్ అన్న ప‌దానికే ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచిన చిరు కెరీర్ ఆద్యంతం డ్యాన్సింగ్‌లో చేసిన ప్ర‌యోగాలు అసాధార‌ణం. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ చిరు ల్యాండ్ మార్క్ స్టెప్పుల గురించి, డ్యాన్సింగ్ స్ట‌యిల్ గురించి న‌వ‌త‌రం మాట్లాడ‌కుండా ఉండ‌రు. నేటి త‌రం హీరోలు, కొరియోగ్రాఫ‌ర్లు డ్యాన్సులు ఏ స్థాయిలో చేయ‌గ‌లిగినా చిరు స్టైల్ డ్యాన్సులు చేయ‌డం క‌ష్ట‌మేన‌ని అంగీక‌రిస్తారు. అందుకే అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ డ్యాన్సుల్లో మెగాస్టార్ ఒక్క‌రే. ఆయ‌న స్టైల్ యూనిక్‌. ఆయ‌న మేన‌రిజ‌మ్స్ ఎక్స్‌క్లూజివ్‌.

ప్ర‌స్తుతం మెగాస్టార్ `ఖైదీ నంబ‌ర్ 150` కోసం డ్యాన్సింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మ‌రోసారి త‌న‌దైన శైలిలో యూనిక్ స్టెప్పుల‌తో అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. హైద‌రాబాద్ -అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో మెగాస్టార్ చిరంజీవి - ల‌క్ష్మీరాయ్‌పై రాఘ‌వ లారెన్స్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో భారీ సెట్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌కు దేవీశ్రీ లిరిక్ అందించ‌డ‌మే కాకుండా అదిరిపోయే ట్యూన్ క‌ట్టారు.
మూవీ హైలైట్ సాంగ్స్‌లో ఇదొక‌టిగా నిలుస్తుంద‌ని యూనిట్ చెబుతోంది. మెగాస్టార్ - లారెన్స్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు కొన్ని పాట‌లు విధిగా గుర్తుకొస్తాయి. `హిట్ల‌ర్‌` మూవీలో ``అబీబీ అబీబీ .. ` అంటూ చిరు వేసిన స్టెప్పులు క‌నుల ముందు క‌దులాడ‌తాయి. `, `ఇంద్ర‌`లో ``దాయి దాయి దామ‌... కులికే కుంద‌నాల కొమ్మ‌..`` సాంగ్‌లో వీణ స్టెప్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌. ``కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి...`, ``మ‌న్మ‌ధ మ‌న్మ‌ధ..`` సాంగ్స్‌(ఇంద్ర‌) కి లారెన్స్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ గుర్తుకొస్తుంది. మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత లారెన్స్ .. మెగాస్టార్‌కి స్టెప్పులు అందిస్తున్నారు. 150వ సినిమాతో మ‌ళ్లీ ఈ క‌ల‌యిక‌లో మ‌రో మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్సెస్‌ని తెలుగు ప్రేక్ష‌కులు వీక్షించే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. పాట‌ల చిత్ర‌ణ‌తో పాటు బ్యాలెన్స్ షూటింగ్‌ని పూర్తి చేసి సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగిస్తాం.

సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ఇదివ‌ర‌కే తెలిపారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved