pizza
రికార్డ్ అంటే మాదే...చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే...
You are at idlebrain.com > news today >
Follow Us

30 April 2015
Hyderabad

అవును ముమ్మాటికీ చరిత్ర సృష్టించడం నందమూరి బాలకృష్ణకే సాధ్యమంటూ మరో సారి ప్రూవ్ చేసిన చిత్రం ‘లెజెండ్’. నందమూరి నటసింహం బాలకృష్ణ నట విశ్వరూపాన్ని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి రికార్డులను తిరగరాస్తున్న చిత్రం ‘లెజెండ్‌’. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై.. మే 1వ తేదికి 400 రోజులను పూర్తి చేసుకుని తెలుగు చలనచిత్ర చరిత్రలో తిరుగులేని రికార్డును సృష్టించింది.

ఇప్పటి వరకు తెలుగు చిత్ర సీమలో మద్రాసు వెల్లింగ్ టన్ థియేటర్ లో జెమినీ బాలనాగమ్మ(1942) డైరెక్ట్ తొలి వందరోజులు చిత్రంగా నిలిచింది. తర్వాత పాతాళ భైరవి(1951), విజయవాడలోని దుర్గా కళా మందిరంలో 200రోజుల చిత్రంగా,విశాఖపట్నం అలంకార్ థియేటర్ లో అడవిరాముడు(1977), తొలి 300రోజుల చిత్రంగా నిలిచాయి. ఇన్నేళ్ల తర్వాత ‘లెజెండ్’ రికార్డ్ రన్ తో 400రోజులు పూర్తి చేసుకోవడం హ్యపీగా ఉందంటూ నందమూరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘సింహా’ వంటి సూపర్‌ సక్సెస్‌ అనంతరం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘లెజెండ్‌’ చిత్రం, ‘సింహా’ రికార్డులను తిరగ రాయడంతోపాటు.. బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. భారీ బడ్టెట్‌తో తెరకెక్కిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

మ్యూజిక్‌ మిస్సైల్‌ దేవిశ్రీప్రసాద్‌ బాణీలు, హీరోయిన్లు సొనల్‌ చౌహాన్‌ అందం, రాధికా ఆప్టే అభినయంతోపాటు.. ఫ్యామిలీ హీరో టర్న్‌డ్‌ విలన్‌ జగపతిబాబు ప్రతినాయకుడిగా ప్రదర్శించిన విలనిజం ‘లెజెండ్‌’ చిత్రానికి మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది.

వీటన్నిటికంటే ముఖ్యంగా.. బాలకృష్ణ పాత్ర తీరుతెన్నుల్ని దర్శకుడు బోయపాటి తీర్చిదిద్దిన విధానం ధియేటర్‌లో ఆడియన్స్‌ చేత విజిల్స్‌ వేయించింది. అలాగే.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర మరియు సమర్పకులు సాయి కొర్రపాటి పాటించిన నిర్మాణ విలువలు ‘లెజెండ్‌’ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

‘లెజెండ్‌’ చిత్రం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో కూడా తన సతా చాటుకుంది. వారం రోజుల సినిమాలు ఆడతాయా అనుకునే ఈరోజుల్లో నటసింహా ఎక్స్‌ట్రార్డినరీ ఫెర్ఫామెన్స్ 50 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసి 2014 బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచింది. కడపజిల్లా ప్రొద్దుటూరులోని ఆర్వేటి థియేట‌ర్‌లో 56రోజులు, అర్చన థియేటర్‌లో 344రోజు(సింగిల్‌ షిఫ్ట్‌ 4 ఆటలు)లతో 400రోజులను పూర్తి చేసుకోగా, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మినీ శివ(డైరెక్ట్‌గా 4ఆటలు)లతో 400రోజులను పూర్తి చేసుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.

ఇంతటి రికార్డ్ విజయానికి అభిమానులే కారణం కాబట్టి వారి సమక్షంలోనే మే 2వ తేది సాయంత్రం కర్నూల్ ఎమ్మిగనూరులోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో అభిమానులు సమక్షంలో భారీ వేడుకను నిర్వహించనున్నారు. నాలుగు వందల రోజులు పూర్తి చేసుకున్న తొలి హీరో చిత్రం నందమూరి బాలకృష్ణది కావడంతో అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఎవరూ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వస్తుంటారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాతలు సహా మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ట్ అంతా ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

 

\


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved