pizza
Rajinikanth's Lingaa music launch in November 2nd week
You are at idlebrain.com > news today >
Follow Us

27 October 2014
Hyderabad

నవంబ‌ర్ రెండ‌వ వారంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ "లింగా"ఆడియో విడుద‌ల‌

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్నచిత్రం ‘లింగా’ ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజని కి జోడిగా అందాల భామలు అనుష్క శెట్టి , సోనాక్షి సిన్హా నటిస్తున్నారు , ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు, ఇటీవ‌లే ప‌వ‌ర్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం తో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో క్రేజీ ప్రొడ్యూసర్ మారిన క్రేజీ ప్రొడ్యూసర్ రాక్ లయన్ వెంకటేష్ నిర్మాత గా మునిరత్న స‌మ‌ర్ప‌ణ‌లో ,రాక్ లయన్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై సౌత్ ఇండియా లో అత్యంత భారీగా తెరకెక్కుతున్న చిత్రం గా లింగా కి యావత్ ప్రపంచమంతా భారి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు, ఇండియా లోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ లింగా మొదటి లుక్ నుంచే చరిత్ర సృష్టించింది. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌.రెహామాన్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఆడియో ని న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో విడుద‌ల చేస్తున్నారు. సినిమా ని సూపర్ స్టార్ రజని కాంత్ పుట్టిన రోజు సందర్భం గా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భం గా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేష్ మాట్లాడుతూ “ మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్న చిత్రం లింగా ., సూపర్ స్టార్ రజని కాంత్ గారితో మేము చిత్రం చేయటం చాలా హ్యాపీ గా ఉంది, అయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హా లు లు నటిస్తున్నారు, ఎ.ఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఇలా భారత దేశం లో ఉన్నతమైన సంకేతిన నిపుణుల తో ఈ చిత్రం చేస్తున్నాము, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గారితో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాము, రవికుమార్, రజని కాంత్ గారి కాంబినేషన్ లో వచ్చిన ముత్తు, అరుణాచలం, న‌ర‌సింహ చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే ఈ సినిమా ఆ చిత్రాలని మించి ఉంటుంది. లింగా చిత్రానికి సంభందించి మొదటి లుక్ ని ఈ వినాయక చవితి కి రిలీజ్ చేసాము. చూసిన ప్రతి ఒక్కరు తలైవా , సూపర్ స్టార్ రజని కాంత గారి లుక్ అదిరిపోయింది అన్నారు. అలాగే దివాళి కానుక‌గా మ‌రో స్టిల్ ని విడుద‌ల చేశాము, దానికి అదే రెస్పాన్స్ వ‌చ్చింది.. ఇటీవ‌లే రామోజి ఫిల్మ్ సిటి లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ కాంత్‌, సోనాక్షి సిన్హా ల పై 8 రోజుల పాటు, 200 మంది డాన్స‌ర్స్ పై మూడున్న‌ర కోట్ల తో అత్యంత సుంద‌రంగా ఆక‌ర్ష‌ణ గా సూప‌ర్‌స్టార్ అభిమానులు ధియోట‌ర్స్ లో విజిల్స్ వేశేలా తీసాము, ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ గారు దుబాయ్,మోకా మరియు అబు ధ‌బి సాంగ్స్ షూటింగ్ నిమిత్తం వెళ్ళారు. ఎబ్రాడ్ లోనే కొన్ని సాంగ్ సీక్వెన్స్ మ‌రియు ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ చిత్రీక‌రిస్తారు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న మా చిత్రానికి ఏ.ఆర్‌.రెహ‌మ‌న్ అందించిన ఆడియో ని నవంబ‌ర్ రెండ‌వ వారంలో విడుద‌ల చేస్తున్నాము. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజున చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాము ” అన్నారు .

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved