pizza
“లవర్స్ “ సినిమా తో మా మాయాబజార్ సంస్థ కి ఇంతటి ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మా ధన్యవాదాలు - నిర్మాతలు
You are at idlebrain.com > news today >
Follow Us

18 August 2014
Hyderabad

“ అంతకు ముందు ఆ తరువాత” లాంటి సూపర్ హిట్ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేఖ స్థానం సంపాయించిన సుమంత్ అశ్విన్ హీరోగా , ” ప్రేమకథా చిత్రం “ లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత నందిత హీరొయిన్ గా , మాయాబజార్ మూవీస్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి , మహేంద్ర బాబు లు కలసి నిర్మించారు . .. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి కథ, మాటలు అందించటమే కాక సమర్పకుడిగా వ్యవహరించారు. హరి చిత్ర దర్శకుడు. జే.బి అందించిన సంగీతం ఆదరణ పొందాయి. ఈ సినిమా స్వతంత్ర దినోత్సవ సందర్భం గా రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఈ సందర్భం గా నిర్మాతలు మాట్లాడుతూ..” అంతకు ముందు ఆ తరువాత చిత్రం తరువాత సుమంత అశ్విన్, ప్రేమకథ చిత్రం తరువాత నందిత లు జంట గా , హరి దర్శకత్వం లో మాసంస్థ మాయాబజార్ మూవీస్ పై వైవిధ్యమైన లవ్ స్టొరీ గా తెరకెక్కిన చిత్రం లవర్స్ వీరిద్దరికీ మరో సూపర్ డూపర్ హిట్ గా నిలవటం చాలా హ్యాపీ గా ఉంది, ఈ చిత్రం లో నందిత , సుమంత్ అశ్విన్ ల మధ్య వచ్చ్చే సన్నివేశాలు ఆకట్టుకోవటమే కాకా చక్కటి వినోదాన్ని పుట్టించాయి.. ఇటీవలే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న షామిలి అండ్ తేజస్విని లు చాలా చక్కటి పాత్రల్లో అలరించారు. మారుతీ అందించిన కథ, మాటలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి, . మారుతీ రాసిన మాటలు హీరో సుమంత్ నోట పలకటం ధియేటర్ లో విజిల్స్ పడుతున్నాయి. డైరెక్టర్ హరి టేకింగ్ ప్రత్యేఖం ఆకట్టుకుంది.. ఈ సినిమా తో ఆయన మంచి దర్శకుల లిస్టు లోకి చేరతారు. అంతే కాదు మా లవర్స్ సినిమా లో చివరి అరగంట లో వచ్చే సప్తగిరి పాత్ర చాలా వినోదాన్ని అందించింది.. మా లవర్స్ సినిమా యువత ని ఆకట్టుకోవటమే కాకుండా ఫ్యామిలీ అంతా చక్కగా నవ్వుకునేలా ఉందని చెప్పటం ఆనందం గా ఉంది. ఈ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మా ధన్యవాదాలు ” అని అన్నారు.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved