pizza
Love story teaser will be out on Jan 10th
జనవరి 10న ''లవ్ స్టోరి'' టీజర్ రిలీజ్
You are at idlebrain.com > news today >
 
Follow Us

8 January -2021
Hyderabad

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ములరూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ''లవ్ స్టోరి''. ఈ అందమైన ప్రేమ కథలోనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీఅభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.‘‘ఫిదా’’ తర్వాత స్టార్డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమాకావడం.నాగ చైతన్య,సాయి పల్లవిలాంటి స్టార్ కాస్టింగ్ ఉండటం ఈ ఎక్స్ పెక్టేషన్స్ కు కారణం.ఇప్పటికేరిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది..షూటింగ్ అంతా కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులుచకచకా జరుపుకుంటుంది.

ఇక ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ అప్ డేట్ రానేవచ్చింది. జనవరి 10,ఉదయం 10:08 గం.లకు ‘‘లవ్ స్టోరీ’’ టీజర్ రాబోతుంది.ఈఅనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది టీమ్.ఈ పోస్టర్లో నాగచైతన్య చెవిలో సాయి పల్లవి ఏదో చెబుతోంది.చూడ ముచ్చటగా ఉన్న ఈ
పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్

మ్యూజిక్ : పవన్ సి.హెచ్

సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు

నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

 

 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved