pizza
"Love Story" ‘Nee Chitram Choosi’ song launched on Valentine’s Day
You are at idlebrain.com > news today >
 
Follow Us

14 February -2021
Hyderabad




Sensible director Sekhar Kammula is known to make love stories thatare heart-touching simultaneously they have an honest approach. Hisnext is ‘Love Story’ starring Akkineni Naga Chaitanya and Sai Pallaviin the lead roles. The teaser was launched some days back and itreceived a good response from the audiences.

Playing the role of Revanth and Mounica, Chaitanya and Pallaviappeared like boy and girl next door. Today on the occasion ofValentine’s Day, a new song is released by the makers. The song ‘NeeChitram Choosi’ and it is crooned by Anurag Kulkarni.

Pawan CH has scored the music while Mittapalli Surender has penned thelyrics. In this lyrical video the makers showed paintings of theiconic structures of Hyderabad that are a symbol of love.

Purana Pul, Koti Residency, British Residency and Taramati-Baradaripaintings are done by the famous painter Moshe Dayan. The lyricalvideo finally takes us to Revanth Zumba Centre which is the epicentreof ‘Love Story.’

Director Sekhar Kammula connects the centuries old Hyderabadi lovetales with that of Revanth and Mounica and that way it would be aremarkable one.

‘Love Story’ is slated for a grand worldwide release on April 16th.Narayan Das K Narang and Puskur Ram Mohan Rao are producing the movieunder Sree Venkateswara Cinemas LLP and Amigos Creations banners.

Other Crew:
Co-Producer: Bhaskar Katkamshetty
Executive Producer: Irla Nageswara Rao
Cinematography - Vijay C. Kumar
Editor - Marthand K. Venkatesh
Music- Pawan Ch
PRO: GSK Media

మన చుట్టూ ఉండే జీవితాల కథలు, ఆ కథల్లో నిజాయితీ, కథనంలో సహజత్వంతోసినిమాలు చేసే దర్శకుడు శేఖర్ కమ్ముల. అక్కినేని హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా ఆయన రూపొందించిన కొత్త సినిమా "లవ్ స్టోరి". టీజర్ తోరేవంత్, మౌనికలుగా చైతూ, సాయి పల్లవిని పరిచయం చేసిన శేఖర్కమ్ముల....ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారి ప్రేమ కథ ఎలాంటిదో పాటతోతెలియజేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా,అనురాగ్ కులకర్ణి పాడారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించారు. "నీ చిత్రంచూసి.. పాట లిరికల్ వీడియోను వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు (ఫిబ్రవరి14) ఉదయం 10.08 నిమిషాలకు విడుదల చేశారు.

"నీ చిత్రం చూసి"...పాటలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రేమ చిహ్నాలనుపెయిటింగ్స్ రూపంలో చూపించారు. హైదరాబాద్ నగర జీవితాన్ని తన చిత్రాలతోఅద్భుతంగా చూపించిన ప్రముఖ చిత్రకారుడు 'మోషే దయాన్' ఈ పాటలోని చిత్రాలనుగీశారు.

ఈ లిరికల్ వీడియో లో అలనాటి హైదరాబాద్ ప్రేమ చిహ్నలైన "పురాణ పూల్","తారామతి బరాదారి", "కోటి రెసిడెన్సీ", "బ్రిటిష్ రెసిడెన్సీ" లనుచూపించిన శేఖర్ కమ్ముల చివరగా రేవంత్ మౌనిక ప్రేమ వారధి అయిన 'రేవంత్జుంబా సెంటర్' ను పాటలో చూపించారు.

భాగ్యనగర ప్రేమ సౌధాలను పేర్కొంటూ 'రేవంత్ జుంబా సెంటర్' ను చూపించడంద్వారా వీళ్లిద్దరి ప్రేమ కథ కూడా అలాంటి గొప్పదేనని దర్శకులు శేఖర్కమ్ముల చెప్పకనే చెప్పారు.

ఏప్రిల్ 16న "లవ్ స్టోరి" సినిమా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకుసిద్ధమవుతోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వరరావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు,రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved