pizza
Mahanati Release Date Announcement - Arriving On May 9
మే 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతున్న `మ‌హాన‌టి`
You are at idlebrain.com > news today >
Follow Us

18 March 2018
Hyderabad

Tollywood's craziest project of the year Mahanati, biopic on legendary actress Savitri produced jointly by prodigious production houses Vyjayanthi Movies and Swapna Cinema, directed by Nag Ashwin is hereby officially announced to arrive in theatres on May 9. Coincidentally, the day happens to be the release date of all time industry blockbuster Jagadekaveerudu Athilokasundari produced by Vyjayanthi Movies in 1990.

Currently, the team if Mahanati moved into final production phase canning few important scenes. Eversince, Keerthy Suresh along with Samantha, Dulquer Salman, Vijay Devarakonda, Mohan Babu, Prakash Raj, Shalini Pandey, Malavika Nair, Bhanu Priya, Divya Vani, Srinivas Avasarala, directors Krish, Tharun Bhascker and other popular names including that of Naga Chaitanya playing the iconic ANR role are made part of this project, there was an immediate hike in expectations. However, Nag Ashwin and his technical team recreated the forgotten glorious black and white era to make Mahanati a true celebration on the life of Savitri.

Crew:
Music: Mickey J Meyer Production Design:Shivam
Art Director: Avinash,
Stylist: Indrakshi
DoP: Dani
Art Supervision: Thota Tharani
Editor: Kotagiri
Director: Nag Ashwin
Producer: Priyanka Dutt

మే 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతున్న `మ‌హాన‌టి`

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `మ‌హాన‌టి`. వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక ద‌త్ నిర్మాత‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు విడుద‌ల తేదీ ఖరారు చేసుకుంది. ఉగాది సంద‌ర్భంగా ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న‌ట్టు నిర్మాత తెలిపారు. 1990 మే 9న‌... వైజ‌యంతీ మూవీస్ సంస్థ నుంచి వ‌చ్చిన `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి` టాలీవుడ్ రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ కొత్త చ‌రిత్ర సృష్టించింది. స‌రిగ్గా అదే రోజున `మ‌హాన‌టి` విడుద‌ల అవుతుండ‌డం విశేషం. టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇది వ‌ర‌కు చూడ‌ని వినోదాన్ని పంచివ్వ‌బోతోంది. మ‌హాన‌టి సావిత్రి క‌థ‌ని వెండి తెర‌పై ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరు.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చిరస్థాయిగా చిలిచిపోయేలా ఉంటుంద‌ని చిత్ర‌బృందం తెలిపింది.

సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శివ‌మ్‌
క‌ళా ద‌ర్శ‌కుడు: అవినాష్‌
స్టైలీష్‌: ఇంద్రాక్షి
ఛాయాగ్ర‌హ‌ణం: ధ‌ని
క‌ళ‌: తోట త‌ర‌ణి
ద‌ర్శక‌త్వం: నాగ్ అశ్విన్‌
నిర్మాత‌: ప్రియాంకా ద‌త్‌


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved