pizza
Mahanubhavudu music launch on 16 September
సెప్టెంబర్ 16న శ‌ర్వానంద్‌, యు.వి.క్రియోష‌న్స్‌, మారుతి "మ‌హ‌నుభావుడు" ఆడియో విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

13 September 2017
Hyderabad

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు చిత్ర షూటింగ్ ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. ఇదిలా ఉంటే... మహానుభావుడు ఆడియో ను సెప్టెబర్ 16న విడుదల చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మి కి చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతమందించాడు. ఈ చిత్రం మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా వుంటుంది.

న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు..

సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, కోరియోగ్రఫి : రాజు సుందరం , గీత రచయితలు : సిరివెన్నెల సీత రామ శాస్త్రి , భాస్కర్ భట్ల, కె కె , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved