pizza
Mahesh Babu to launch Krishna Gadi Veera Prema Gadha’s Audio
You are at idlebrain.com > news today >
Follow Us

15 January 2016
Hyderabad

Nani starrer Kirshna Gadi Veera Prema Gadha is gearing up for a grand audio launch. The movie, directed by Hanu Raghavapudi and produced under the 14 Reels Entertainment banner, has released its first look and teaser to a great positive audience response.

The audio launch, which is to be held on the 20th of January, at Shilpakala Vedika is going to be a grand affair, with the who’s who of Tollywood industry said to be attending the function. The audio will be launched by Super Star Mahesh Babu. The music for this movie is scored by Vishal Chandrashekar, and the movie is all set to be released on the 5th of February.

సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలవుతున్న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఆడియో

‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘1 నేనొక్కడినే’, ‘లెజెండ్’, ‘పవర్’(కన్నడం), ‘ఆగడు’, వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం7గా యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్, థీమాటిక్ టీజర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భలే భలే మగాడివోయ్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నాని హీరోగా నటిస్తున్న చిత్రమిది. అందాల రాక్షసి వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి తెరకెక్కుతోంది. రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర నిర్మాతలు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 20న నిర్వహిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా ఫిభ్రవరి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved