pizza

Glad To Release The Teaser Of KV Guhan Gari Directorial 'WWW' - Superstar Mahesh Babu
కేవి గుహ‌న్ గారు డైరెక్ట్ చేసిన `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది - సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు

You are at idlebrain.com > news today >
Follow Us

15 January -2021
Hyderabad


Popular Cinematographer KV Guhan after delivering a SuperHit '118' as his is now coming with a different Thriller titled 'WWW' (Evaru.. Ekkada.. Enduku..) as his latest film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner. Teaser of 'WWW' is unveiled by Superstar Mahesh Babu on the occasion of Makar Sankranthi.

Superstar Mahesh Babu says, " KV Guhan Garu is one of my favourite technicians. I have worked with him for very good films. I am glad to release the teaser of KV Guhan Gari Directorial 'WWW'. Teaser is very good. I wish the film to become a very good Hit. All the best to the entire team."

Director KV Guhan says, " Mahesh Garu is a very kind hearted person who always respect technicians. I have worked with Mahesh Garu for his Blockbuster films 'Athadu', 'Seethamma Vaakitlo Sirimalle Chettu', ' Dukudu'. It's always a delight to work with him. He congratulated me for my first directorial '118' after watching it with a tweet. Out of affection for me, he released the teaser of 'WWW' today and I am very happy. This is a good sign for the success of the film."

Producer Dr. Ravi P. Raju Datla says, " 'WWW' is the first movie in our Ramantra Creations banner. I am very happy and proud that a Superstar like Mahesh Garu has launched the teaser of our first film. Our teaser which got released by the golden hand of Mahesh Garu is getting very good response. Guhan Garu has made this film superbly. We believe this film will become very big Hit."

Hero Adith Arun says, " I feel lucky that our 'WWW' teaser got launched by Mahesh Garu who is an inspiration for many. Many thanks to him. Guhan Garu has made this film in a very thrilling manner."

Heroine Shivani Rajashekar says, " My father and Mahesh Babu Garu has a very good relation. We all love Mahesh Babu Garu very much. I am thrilled that the teaser of my first film gets launched by Mahesh Babu Garu."

Co-Producer Vijay Dharan Datla says, " Special Thanks to Mahesh Garu on behalf of our entire team for releasing the teaser of 'WWW' and for encouraging our banner. Inspite of his busy schedule Mahesh Garu launched the teaser out of respect for Guhan Garu. Shooting part has been completed and the film is currently undergoing it's post production works. We are planning to release the film very soon."

Arun Adith, Shivani Rajashekar, Priyadarshi, Viva Harsha and others are the principal cast

Banner : Ramantra Creations
Music : Simon K. King
Editing : Thammiraju
Art: Nikhil Hassan
Dialogues : Mirchi Kiran
Lyrics: Ramajogayya Sastry, Ananth Sriram
Choreography: Prem Rakshith
Stunts: Real Sathish
Costume Designer: Ponmani Guhan
Production Controller: K. Ravikumar
Co-producer: Vijay Dharan Datla
Producer: Dr. Ravi P. Raju Datla
Story, Screenplay, Cinematography & Direction: K V Guhan

 

కేవి గుహ‌న్ గారు డైరెక్ట్ చేసిన `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది - సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు

`118` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌`డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. మ‌క‌ర సంక్రాంతి పండ‌గ‌ సంద‌ర్భంగా `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` మూవీ టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మాట్లాడుతూ - ``నాకు ఇష్ట‌మైన టెక్నీషియ‌న్స్‌లో కేవి గుహ‌న్ గారు ఒక‌రు. ఆయ‌న‌తో చాలా మంచి సినిమాల‌కు వ‌ర్క్‌ చేశాను. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు`టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. టీజ‌ర్ చూశాను చాలా బాగుంది సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ - ``టెక్నీషియ‌న్స్‌కి ఎంతో గౌర‌వం ఇచ్చే మంచి వ్య‌క్తి మ‌హేష్‌బాబు గారు. మ‌హేష్‌గారితో `అత‌డు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `దూకుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌కి వ‌ర్క్ చేశాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. అలానే నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి చిత్రం `118` చూసి న‌న్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. నా మీద అభిమానంతో `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఈ చిత్రం విజ‌యానికి శుభ‌సూచ‌కం`` అన్నారు.

చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు దాట్ల మాట్లాడుతూ - `` మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడబ్ల్యు`. మా మొద‌టి సినిమా టీజ‌ర్‌ మ‌హేష్ బాబు గారి లాంటి సూప‌ర్‌స్టార్ లాంచ్ చేయ‌డం ఆనందంగా, గ‌ర్వంగా ఉంది. మ‌హేష్ బాబు గారి గోల్డెన్ హ్యాండ్‌తో రిలీజైన మా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గుహ‌న్ గారు ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

హీరో అథిత్ అరుణ్ మాట్లాడుతూ - ``ఎంతో మందికి ఇన్స్‌పిరేష‌న్ అయిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గారు మా `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` టీజ‌ర్ లాంచ్ చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. గుహ‌న్ గారు ఈ సినిమా ఎంతో థ్రిల్లింగ్‌గా తీశారు`` అన్నారు.

హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``నాన్న గారికి మ‌హేష్‌బాబు గారికి మంచి అనుభందం ఉంది. మా అంద‌రికీ మ‌హేష్‌బాబు అంటే చాలా ఇష్టం. నా తొలిచిత్రం టీజ‌ర్ మ‌హేష్‌బాబు గారు లాంచ్ చేయ‌డం చాలా థ్రిల్‌గా ఉంది`` అన్నారు.

కో - ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ధ‌ర‌న్ దాట్ల మాట్లాడుతూ - ``ఎంతో బిజీగా ఉండి కూడా గుహ‌న్ గారి మీద అభిమానంతో టీజ‌ర్‌ని రిలీజ్‌చేసి మా సంస్థ‌ని ఎంత‌గానో ప్రోత్సహిస్తున్న మహేష్‌బాబుగారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. ప్ర‌‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్, ప్రియ‌ద‌ర్శి, వైవా హ‌ర్ష త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బ్యాన‌ర్‌: రామంత్ర క్రియేష‌న్స్,
సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌: నిఖిల్ హ‌స‌న్‌,
డైలాగ్స్‌: మిర్చి కిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత‌ శ్రీ‌రామ్‌,
కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్,
స్టంట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: పొన్మ‌ని గుహ‌న్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. రవి కుమార్‌,
కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల,
నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు దాట్ల,
క‌థ‌, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కె వి గుహ‌న్‌.

 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved