pizza
Mahesh Babu - Koratal Siva film release on 27 April 2018
ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివ, దానయ్య డి.వి.వి.ల భారీ చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

26 October 2017
Hyderabad

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి. ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న భారీ చిత్రం షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ''నవంబర్‌ 7 వరకు హైదరాబాద్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. నవంబర్‌ 22 నుంచి ఔట్‌ డోర్‌ షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మా బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ. అలాగే మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved