pizza
Manalo Okadu audio success meet on 19th September in Tirupati
19న తిరుప‌తిలో `మ‌న‌లో ఒక‌డు` ఆడియో స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > news today >
Follow Us

14 September 2016
Hyderaba
d

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `మ‌న‌లో ఒక‌డు` ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ నెల 19న తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ జ‌ర‌గ‌నుంది. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు.

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ``మా చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం డీటీయ‌స్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నెల 19న తిరుప‌తిలో సంగీత విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హిస్తాం. `మ‌న‌లో ఒక‌డు` మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం`` అని అన్నారు.

నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ ``ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. అందుకే 19న తిరుప‌తిలో ఆడియో స‌క్సెస్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. ఈ నెలాఖ‌రున చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం `` అని చెప్పారు. సాయికుమార్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్: గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved