pizza
Manchu Lakshmi's next titled "W/o Ram"
‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ గా మంచు లక్ష్మి
You are at idlebrain.com > news today >
Follow Us

15 January 2017
Hyderabad

As we all know Manchu lakshmi is one who always encourages young talent and does interesting films.after proving her stamina with many successful films..,coming up with yet another interesting thriller film called "W/o Ram'..

Vijay Yelakanti who was the associate of Star Director SS Rajamouli is making his directional debut with this film.while Lakshmi manchu playing main lead..Adarsh Balakrishna, Samrat,Priyadarshi,Srikanth Ayyangar are doing other important characters..

"W/o Ram" is all about a women who believes in lies and gets into problems.. This is very different charecter for Manchu lakshmi and she portrayed brilliantly,entire shoot of the film is completed.we are very much confident with output.Currently we are in post -production stage and planning to release the film very soon. Says director Vijay Yelakanti.

"W/o Ram" jointly produced by Manchu Entertainments and People Media Factory banners.

Cast:
Lakshmi Manchu
Samrat Reddy
Aadarsh Balakrishna
Srikanth Ayyangar

Crew:
Presented by Krithi prasad,Vidya Nirvana Manchu Anand.
DOP-Samala Bhaskar
Music- Raghu DIXIT
Editor- Thammiraju
Executive Producer- Suhasini Rahul
PRO- GSK Media
Dialogues- Sandeep gunta
Production design-Deep Bhimajiyani
Co Producer- Vivek Kuchibotla
Producer- TG Vishwa prasad,Manchu Lakshmi.
Story-Screenplay-Directior- Vijay Yelakanti

‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ గా మంచు లక్ష్మి

కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే నటి మంచు లక్ష్మి. తండ్రికి తగ్గ తనయగా, బెస్ట్ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మి మరోసారి ఓ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. చాలా రోజులు క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ టైటిల్ ను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు. ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ ఈ చిత్రం పేరు. కథకు ఖచ్చితంగా సరిపోతుందని భావించి ఈ టైటిల్ నిర్ణయించారు. టైటిల్ చాలా బావుందని చిత్ర యూనిట్ తో పాటు చాలామంది నుంచి మంచి అప్రిసియేషన్ వస్తోంది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఇందులో మంచు లక్ష్మి పాత్ర చాలా భిన్నంగా సాగుతుంది. అబద్ధాలను నిజమని నమ్మే పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తుంది. ఈ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా, అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. పూర్తి వైవిధ్యంగా మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇది. రాజమౌళి వద్ద ‘ఈగ’, ‘బాహుబలి-1’ చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మంచు లక్ష్మి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘వైఫ్ ఆఫ్ రామ్’లో సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, పెళ్ళి చూపులు ఫేమ్ ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..

సాంకేతిక నిపుణులు..
ఎడిటర్ : తమ్మిరాజు,
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భాస్కర్, సంగీతం : రఘు దీక్షిత్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుహాసిని రాహుల్,
పి ఆర్ ఓ : జి యస్ కే మీడియ
మాటలు : సందీప్ గుంటా,
ప్రొడక్షన్ డిజైనర్ : దీప్ భీమజయిని,
కో ప్రొడ్యూసర్- వివేక్ కూచిబొట్ల
నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్,
నిర్మాతలు- టి. జి విశ్వప్రసాద్,మంచు లక్ష్మీ.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : విజయ్ యెలకంటి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved