pizza
Mannara Chopra & Angela in Rogue
పూరి జగన్నాథ్‌ 'రోగ్‌'లో హీరోయిన్స్‌ డబుల్‌ ధమాకా
You are at idlebrain.com > news today >
Follow Us

18 February 2017
Hyderabad

From his first film 'Badri' to his latest film 'Ism', Director Puri Jagannadh is known for his knack in Heroes characterisation, mannerism with different subjects. Now he is coming up with a different love story. Puri is getting ready to cater a different experience with his new film 'Rogue' which also has an interesting tag-line 'Maro Chantigaadi Prema Katha'. Ishan is being introduced as Hero with this film produced by Dr. C.R. Manohar and C.R. Gopi in Tanvi Films banner presented by Jayaditya. First look poster which was released for Valentines Day raised curiosity on the film.

Puri Jagan also known for introducing talented, glamorous heroines like Anushka, Asin, Hansika, Rakshitha, Disha Patani, Kangna Ranaut, Siya Gautham, Neha Sharma, Sameeksha, Ayesh takia, Adah Sharma with his films is coming with two heroines in 'Rogue'. Mannara Chopra, Angela will be seen with Ishan in this film. Since Puri Jagan is known for showcasing heroines glamorously, 'Rogue' will be eye-catching with two heroines.

Puri Jagan has a different taste in chosing titles for his films. This time also he grabs the attention with 'Rogue'. Since the release of first look poster, 'Rogue' has become one of the most awaited films of the season. Motion poster of the film will be released on February 19th. Stills of heroines, Mannara Chopra & Angela were released today. Makers are planning to release the film in Telugu and Kannada very soon.

Along with Ishan, Mannara Chopra, Angela in lead roles Anoop Singh, Azad Khan, Posani krishna Murali, Ali, Sathya Dev, Subba Raju, Rahul Singh, Tulasi, rajeswari, Sandeepthi will be seen in other important roles.

Production Controller : B. Ravi Kumar, Art : Johnny Shaikh, Editor: Junaid Siddique, Music : Sunil Kashyap, Cinematography : Mukesh.G, Producers : C.R. Manohar, C.R Gopi, Direction : Puri Jagannadh

పూరి జగన్నాథ్‌ 'రోగ్‌'లో హీరోయిన్స్‌ డబుల్‌ ధమాకా

'బద్రి' నుంచి 'ఇజమ్‌' వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌గానీ, మేనరిజంగానీ డిఫరెంట్‌గా వుండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి.

అనుష్క, అసిన్‌, హన్సిక, రక్షిత, దిశా పటాని, కంగనా రనౌత్‌, శియా గౌతమ్‌, నేహాశర్మ, సమీక్ష, అయేషా టకియా, అదాశర్మ వంటి గ్లామరస్‌ హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్‌ 'రోగ్‌' చిత్రం ద్వారా డబుల్‌ ధమాకాగా ఇద్దరు హీరోయిన్లను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇషాన్‌ సరసన మన్నారా చోప్రా, ఏంజెలా నటిస్తున్నారు. తన ప్రతి సినిమాలోనూ హీరోయిన్లను ఎంతో గ్లామర్‌గా చూపించే పూరి ఈ సినిమా కాస్త డోస్‌ పెంచి ఇద్దరు హీరోయిన్లతో కనువిందు చేయబోతున్నారు.

'రోగ్‌' అనే డిఫరెంట్‌ టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పూరి డిఫరెంట్‌ ప్రమోషన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచుతున్నారు. 'రోగ్‌' మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ డిస్కషన్‌ పాయింట్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు ఈ చిత్రంలోని హీరోయిన్స్‌ మన్నారా చోప్రా, ఏంజెలా స్టిల్స్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved