pizza

Manoj film in Yellow Flowers banner

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం

 

You are at idlebrain.com > news today >
Follow Us

21 December 2015
Hyderabad

 

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం ప్రారంభం కానుంది. ‘కరెంట్ తీగ’ వంటి హిట్ తర్వాత శౌర్య వంటి మరో డిఫరెంట్ సినిమాలో నటిస్తున్న మంచు మనోజ్ తన స్టయిల్లో నెక్ట్స్ చేయనున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. రవితేజతో ‘మిరపకాయ్’, బాలకృష్ణతో ‘శ్రీమన్నారాయణ’, నానితో పైసా’ వంటి డిఫరెంట్ మూవీస్ ను నిర్మించి నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో కమర్షియల్ చిత్రాలకు సంగీతాన్నందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్,థమన్ కాంబినేషన్ లో రానున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి గిరి కథను అందించారు. రచన, స్క్రీన్ ప్లేను కిషోర్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి సాగర్ పసల దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ ఫార్మెట్ లో మనోజ్ ను సరికొత్త రీతిలో ప్రెజెంట్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుటు, టెక్నిషియన్స్ త్వరలోనే ప్రటిస్తామని చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేశారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved