pizza
Manchu Manoj's new film in Eeswar direction launched
మంచు మనోజ్ హీరోగా జ్యోత్న్స ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

1 June 2015
Hyderabad

రాక్ స్టార్ మంచు మనోజ్ హీరోగా (సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం) ఫేం జి.ఈశ్వర్ దర్శకత్వంలో నూతన సంస్థ జ్యోత్న్స ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం (31.5.2015) ఉదయం ఫిలించాంబర్ దేవస్థానంలో జరిగాయి. హీరో మనోజ్ క్లాఫ్ ఇవ్వగా, గౌతమ్, మిసెస్ గౌతమ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఈశ్వర్ దర్శకత్వంలో రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహంపై ముహూర్తం షాట్ ను తీసారు.

అనంతరం హీరో మనోజ్ మాట్లాడుతూ - ''కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది'' అని తెలిపారు.

డైరెక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ - ''నాకీ అవకాశం ఇచ్చిన మంచు మనోజ్ గారికి, మంచు ఫ్యామిలీకి కృతజ్ఞతలు. ఈ చిత్రం నా కెరియర్ లో, మనోజ్ గారి కెరియర్ లో, జ్యోత్న్స ఫిలింస్ బ్యానర్ లో మైలురాయిగా నిలిచే చిత్రం అవుతుందని ప్రామిస్ గా చెప్పగలను. స్ర్కిఫ్ట్ పరంగా హీరో, ఇద్దరు హీరోయిన్స్, 15మంది ఇతర ఆర్టిస్ట్ లతో మేజర్ పార్ట్ ని దుబాయ్ లో షూట్ చేయాల్సి ఉంటుంది. నిర్మాత జస్వంత్ ఖర్చుకు వెనకాడకుండా వెంటనే ఒకే చెప్పారు. మంచి సినిమా నిర్మించాలనే తపన ఉన్న నిర్మాత జస్వంత్. ఇద్దరు హీరోయిన్స్ తో మనోజ్ చేసే లవబుల్ రొమాంటిక్ జర్నీతో పాటు ఎంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ బ్రహ్మానందంతో చేసే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. టోటల్ గా రెండు గంటలు కడుపుబ్బా నవ్వించగలిగే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది'' అని చెప్పారు.

నిర్మాత జస్వంత్ మాట్లాడుతూ - ''ముందుగా మనోజ్ గారికి కృతజ్ఞతలు. మా తొలి సినిమానే మా బ్యానర్ వ్యాల్యూ పెరిగేలా ఉంటుంది. ఈశ్వర్ చెప్పిన కథ నచ్చడంతో ఖర్చుకి వెనకాకుండా మంచి సాంకేతిక వర్గం, టాప్ ఆర్టిస్ట్ లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాం. జూలై సెకండ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. త్వరలో టెక్నీషియన్స్ ని, ఆర్టిస్ట్ ల పేర్లును వెల్లడిస్తాం. మీ అందరి ఆశీస్సులతో మా ఈ మొదటి ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం'' అని అన్నారు.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved