15 December 2014
Hyderabad
ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకి అద్బుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు చక్రి. ఈరోజు ఉదయం చక్రి మరణవార్త విన్నవెంటనే దర్శకుడు మారుతి షాక్ కి గురయ్యారు. చక్రి తో నేను ఎప్పుడు పనిచేయలేదు కాని చక్రి బ్రదర్ మహిత్ తో మేము ఓ చిత్రాన్ని చేశాము. ఆ సమయంలో చక్రి ని కలవటం జరిగింది. చాలా మంచివాడు ,సౌమ్యుడు అందరిని ఆప్యాయం గా పలకరించేవాడు. కలిసిన మెదటి పరిచయమే గుర్తుండిపోయోలా వుంది. శివమణి చిత్రంలో రామా రామా అనే సాంగ్ ఇప్పటికి అందరి ఇంటిలో పాడుతూ వుంటారు. అలాంటి చక్రి ఈరోజు ఇలా హఠార్మణం చెందటం చాలా భాదాకరం. చక్రి మరణం జీర్ణించుకోలేనిది , చక్రి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , వారి కుటుంబ సభ్యులకి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను అని దర్శకుడు మారుతి అన్నారు