pizza
Our Akkineni Family Shares A Special Bond With May 22nd - King Nagarjuna
22 తో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది - కింగ్ నాగార్జున
You are at idlebrain.com > news today >
Follow Us

23 May 2020
Hyderabad

 

 


King Nagarjuna said that The Akkineni Family shares a special bond with May 22nd,

" During the preview of 'Manam' which was held at Prasad IMAX on May 22nd, A person who is very close to my father came to me and said that my father went to the office of Ghantasala Balaramayya garu to act in his first film 'Seetharama Jananam' on the same date, May 22nd. Then only I came to know the importance of that date. 'Manam' was released on the next day, May 23rd. On the day of its release, everyone called me to congratulate Manam's success and also for completing 28 years of career as my first film 'Vikram' was also released on the same date, May 23rd. It wasn't planned to release 'Manam' featuring my Father and us on the same date on which my first film got released. When my father went to Ghantasala Balaramayya gari office, popular actor Peketi Sivaram garu was there and he received my father warmly. Peketi garu accompanied my father on the first day of shoot of his first film and he is the one who walks my father from the make-up room to the shooting spot. During the launch of my first film 'Vikr

am', Peketi garu came and accompanied me from the make-up room to the shooting spot. You can find Peketi garu in the opening still of 'Vikram'. He stands between my father and Director Madhusudana Rao garu. Dasari garu and Raghavendra Rao garu attended the launch of my first film 'Vikram'. Later on, Dasari garu gave me a very good success with 'Majnu' and Raghavendra Rao garu gave me memorable classic 'Annamayya' which was released on May 22nd. Every year I start receiving phone calls from the morning of May 22nd about 'Manam', 'Annamayya', and 'Vikram'. That's why that date (May 22nd) has a lot of importance. It was the date my father came to Madras to enter into the film industry. That's why I love that date. 'Vikram' was released on May 23rd, 'Manam' produced by us in Vikram's direction also released on May 23rd. None of these are planned but it all happened like a design. Every year on May 22nd, the date my father started his journey in films, I receive congratulatory calls and messages for the successes

of my films released on May 22nd and May 23rd. Every year May 22nd brings me a lot of joy. I am very happy that my career began with 'Vikram' has successfully completed 34 years. I would like to thank the audience, our Akkineni fans, each and everyone who supported us in our successful journey.", said King Nagarjuna

మే 22 కీ, మా అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉంది అన్నారు కింగ్ నాగార్జున.

"నాన్నగారితో నేను, చైతు, అఖిల్ కలిసి నటించిన 'మనం' చిత్రం ప్రివ్యూ ను మే 22 రాత్రి ప్రసాద్ ఐమాక్స్ లో వేసినప్పుడు నాన్నగారితో బాగా అనుబంధం ఉన్న ఒక వ్యక్తి నా దగ్గిరకు వచ్చి మే 22 తేదీనే నాన్నగారు హీరోగా నటించిన తొలి చిత్రం 'సీతారామ జననం' లో నటించడానికి ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్ కి వెళ్ళారని చెప్పారు. అప్పుడే ఈ డేట్ కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి నాకు తెలిసింది. మే 23న 'మనం' రిలీజ్ అయ్యింది. ఆ రోజు అందరూ ఫోన్ చేస్తూ నాకు ఈ సినిమా హిట్ తో పాటూ నా తొలి చిత్రం 'విక్రమ్' రిలీజ్ అయ్యి 28 ఏళ్ళు అయిందని చెప్పడం మొదలెట్టారు. నాన్నగారితో మేమంతా కలిసి నటించిన 'మనం', నేను నటించిన ఫస్ట్ పిక్చర్ 'విక్రమ్' ఒకే రోజు రిలీజ్ అవడం కూడా ప్లాన్ చేసింది కాదు. నాన్నగారు ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న ప్రముఖ నటులు పెకేటి శివరాం గారు నాన్నగారిని ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుని ఆఫీస్ లోకి తీసుకెళ్ళడమే కాకుండా షూటింగ్ ఫస్ట్ డే న ఫస్ట్ షాట్ తీసేటప్పుడు దగ్గిరుండి మేకప్ రూమ్ నుండి షూటింగ్ స్పాట్ కు తీసుకువచ్చారు. అదే విధంగా నా తొలి చిత్రం 'విక్రమ్' కి కూడా పేకేటి గారు ప్రత్యేకంగా వచ్చి ఫస్ట్ షాట్ తీసేటప్పుడు నన్ను మేకప్ రూమ్ నుండి షూటింగ్ స్పాట్ కి తీసుకొచ్చారు. విక్రమ్ ఓపెనింగ్ స్టిల్ లో కూడా నాన్నగారు, డైరెక్టర్ మధుసూదన రావు గారి మధ్య పేకేటి గారు ఉన్నారు. నాన్నగారి పిలుపు మేరకు ఆ రోజు విక్రమ్ ఓపెనింగ్ కి విచ్చేసిన దాసరి గారు నాకు 'మజ్ను' తో మంచి విజయాన్ని అందిస్తే, రాఘవేంద్రరావు గారు 'అన్నమయ్య' లాంటి మరిచిపోలేని గొప్ప చిత్రాన్ని ఇచ్చారు. 'అన్నమయ్య' కూడా మే 22 నే విడుదలై గొప్ప చరిత్ర సృష్టించింది. అందుకే మే 22 ఉదయం నుండే అందరూ 'మనం' గురించి, 'అన్నమయ్య' గురించి, 'విక్రమ్' గురించి నాకు ఫోన్లు చేస్తూ అభినందిస్తుంటారు. ఇలా ఆ డేట్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా మా నాన్నగారు సినీ పరిశ్రమ లోకి రావడానికి మద్రాసు మహానగరంలో అడుగు పెట్టిన రోజది. అందుకే ఆ డేట్ అంటే నాకు ఎంతో ఇష్టం. 'విక్రమ్' మే 23 న రిలీజ్ అయ్యింది. విక్రమ్ డైరెక్షన్ లో మేము తీసిన 'మనం' కూడా మే 23 న రిలీజ్ అయ్యింది. ఇదంతా ప్లాన్ చేసింది కాదు కానీ ఏదో అలా డిజైన్ చేసినట్లు జరిగింది. నాన్నగారు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 22 నే, 22, 23న సాధించిన విజయాలను అభినందిస్తూ ఫోన్లు వస్తుంటాయి. అందుకే మే 22వ తేదీ నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. విక్రమ్ తో ప్రారంభమైన నా

నటజీవితం 34 ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా పూర్తవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి కారకులైన ప్రేక్షకులకు, మా అక్కినేని అభిమానులకు, మా అభివృద్ధి కి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అన్నారు కింగ్ నాగార్జున

 

 

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved