pizza
Natural Star Nani & Sai Pallavi's 'MCA' Worldwide Grand Release On Dec 21st
వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిసెంబ‌ర్ 21న గ్రాండ్ రిలీజ్ అవుతున్న నాని, దిల్‌రాజు, శ్రీరామ్ వేణు ల `ఎం.సిఎ`
You are at idlebrain.com > news today >
Follow Us

28 November 2017
Hyderabad

Double hat trick hero - Natural Star Nani and successful producer Dil Raju collaborated for a film ‘MCA’ under 'Sri Venkateswara Creations' banner. Sai Pallavi who was introduced as Bhanumathi for Telugu audiences with Sekhar Kammula's super hit film Fidaa is lead actress in MCA. Sriram Venu is directing the film which is co-produced by Sirish and Lakshman. The film’s entire shooting part has been wrapped up except for couple of songs. MCA is all set for worldwide grand release on December 21st.

Speaking on the occasion, producer Dil Raju said, “Five hits have been delivered this year from 'Sri Venkateswara Creations' banner Shatamanam Bhavati, Nenu Local, DJ-Duvvada Jagannadham, Fidaa and Raja The Great. And MCA will be a double hat-trick film for us. The film’s output has come out really well and we are very much confident about Nani scoring much bigger hit than our previous combination film Nenu Local. Sai Pallavi who starred in our successful project Fidaa has paired opposite Nani, whereas Bhumika will be seen in a crucial role in the movie. Devi Sri Prasad who provided wonderful music for Nenu Local has scored music for MCA as well. Recently released title track has got overwhelming response. Director Sriram Venu who penned a winning story is presenting Nani in brand new avatar in the film. MCA will surely be a special film for Nani who’s attaining back to back hits. The remaining two songs will be shot in Spain. The balance production work will be wrapped up in 4 days. After completing all the formalities including censor, we will be releasing MCA worldwide grandly on December 21st.”

Nani, Sai Pallavi, Bhumika, Vijay, Senior Naresh, Amani etc. are prominent cast in the film for which dialogues have been penned by Mamidala Tirupati and Srikanth Vissa. Here is other technical crew- Art Director: Ramanjaneyulu, Music: Devi Sri Prasad, Cinematography: Sameer Reddy, Production Banner: Sri Venkateswara Creations, Producers: Dil Raju, Sirish and Lakshman, Story, Screenplay, Direction: Sriram Venu.

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిసెంబ‌ర్ 21న గ్రాండ్ రిలీజ్ అవుతున్న నాని, దిల్‌రాజు, శ్రీరామ్ వేణు ల `ఎం.సిఎ`

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా `ఎం.సి.ఎ`. దిల్‌రాజు `ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌ నిర్మాత‌లుగా ఈ సినిమా రూపొందుతోంది. రెండు పాటలు మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. సినిమాను డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ ఏడాది రూపొందిన శ‌త‌మానంభ‌వ‌తి, నేను లోక‌ల్‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాల‌తో వ‌రుస‌గా ఐదు హిట్స్ సాధించాం. డ‌బుల్ హ్యాట్రిక్ సాధించ‌డానికి ఎం.సి.ఎతో సిద్ధ‌మ‌వుతున్నాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌స్తుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అల్రెడి డబుల్ హ్యాట్స్ సాధించిన హీరో నాని ఈ సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్‌కు నాంది ప‌లుకుతాడన‌డంలో సందేహం లేదు. ఈ ఏడాదినే `నేను లోక‌ల్‌`తో నాని మా బ్యాన‌ర్‌లో హిట్ కొట్టాడు. `ఎం.సి.ఎ` దీన్ని మించే హిట్ అవుతుంది. మా బ్యాన‌ర్లో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన మూవీ `ఫిదా`లో న‌టించిన సాయిప‌ల్ల‌వి నానికి జోడిగా న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, ప్రేక్ష‌కుల్లో మా బ్యాన‌ర్ వాల్యూను పెంచుతూ మాకు డ‌బుల్ హ్యాట్రిక్‌ను తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంది కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. `నేను లోక‌ల్` చిత్రానికి ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు. అందుకు సాక్ష్య‌మే ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ ట్రాక్‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌. అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లోన ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారు. విజ‌యాలు సాధిస్తున్న నానికి ఈ `ఎంసీఏ` చిత్రం మ‌రో మెట్టుకానుంది. రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ రెండు పాట‌ల‌ను స్పెయిన్‌లో చిత్రీక‌రిస్తాం. నాలుగు రోజుల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేస్తాం. సెన్సార్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.

నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్ డైరెక్ట‌ర్ః రామాంజ‌నేయులు, మ్యూజిక్ః దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః స‌మీర్‌రెడ్డి, నిర్మాణంః శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, నిర్మాత‌లుః దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ వేణు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved