pizza
Matinee Entertainment And Director Swaroop RSJ’s Mishan Impossible Launched
మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ఫిల్మ్ 'మిశ‌న్ ఇంపాజిబుల్' ప్రారంభం
You are at idlebrain.com > news today >
 
Follow Us

12 December -2020
Hyderabad

 

Matinee Entertainment, one of the popular production houses in Tollywood right now, is making multiple projects with star to young heroes. They already announced their production No 8 with talented director Swaroop RSJ whose debut directorial Agent Sai Srinivasa Athreya was critically acclaimed and was a commercial hit.

The film has been launched today with a pooja ceremony, wherein regular shoot commences from December 14th. Title and first look poster of the film are also unveiled today.

Titled Mishan Impossible, it is a distinctive subject on the lines of a bounty hunting film set in a village near Tirupati. The letters SIO from Mission are crossed-out and are replaced by the letters ha. The title sounds crazy, whereas the first look poster looks quite interesting.

The film’s story revolves around three characters which are revealed through the first look poster. Three kids are seen in the avatars of Lord Hanuma, Shiva and Sri Krishna with each carrying guns.

Apart from these three, the film will also feature two important characters. The male and female lead characters will be announced soon.

Niranjan Reddy and Anvesh Reddy will be producing the film while N M Pasha is the Associate Producer. It will have cinematography to be handled by Deepak Yeragara and music to be scored by Mark K Robin. Ravi Teja Girijala is the editor.

Technical Crew:

Banner:Matinee Entertainment
Writer and Director: Swaroop RSJ
Producers: Niranjan Reddy and Anvesh Reddy
Associate Producer: N M Pasha
Cinematography: Deepak Yeragara
Music Director: Mark K Robin
Editor: Ravi Teja Girijala
Art Director: Nagendra
PRO: Vamsi Shekar

 

 

టాలీవుడ్‌లోని పాపుల‌ర్ నిర్మాణ సంస్థ‌ల్లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఒక‌టి. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు ప‌లు చిత్రాల‌ను నిర్మిస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే స్వ‌రూప్ ఆర్ఎస్‌జె డైరెక్ష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 8ను ఆ సంస్థ ప్ర‌క‌టించింది. 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ'తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన స్వ‌రూప్ త‌న డెబ్యూ ఫిల్మ్‌తోటే ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డంతో పాటు, అటు మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌నూ సాధించారు.

స్వ‌రూప్ ఆర్ఎస్‌జె డైరెక్ష‌న్‌లో నిర్మిస్తోన్న చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ‌నివారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో యంగ్ డైరెక్ట‌ర్స్ పాల్గొన్నారు. స్వ‌రూప్‌కు అన్వేష్ రెడ్డి, రాహుల్ యాద‌వ్ సంయుక్తంగా సినిమా స్క్రిప్టును అంద‌జేశారు. 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ఫేమ్ వెంక‌టేష్ మ‌హా క్లాప్ నివ్వ‌గా, 'క‌ల‌ర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి 'డియ‌ర్ కామ్రేడ్' ఫేమ్ భ‌ర‌త్ క‌మ్మ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా టైటిల్ లోగోతో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ చిత్రానికి 'మిశ‌‌న్ ఇంపాజిబుల్' అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ను ప్ర‌క‌టించారు. తిరుప‌తి స‌మీపంలోని ఓ గ్రామంలో నిధి అన్వేష‌ణ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో హ‌నుమంతుడు, శివుడు, శ్రీ‌కృష్ణుని వేష‌ధార‌ణ‌లో ఉన్న ముగ్గురు పిల్ల‌ల చేతుల్లో గ‌న్స్ ఉండ‌టం చూస్తే, ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇంగ్లీష్ టైటిల్‌లో మొద‌టి ప‌దం 'Mission'లో 'sio' అక్ష‌రాల‌ను క్రాస్ చేసి, వాటి పైన‌ 'ha' అక్ష‌రాల‌ను పెట్ట‌డం, పోస్ట‌ర్ క్రేజీగా క‌నిపిస్తుండ‌టంతో ఈ సినిమాపై ఇప్ప‌ట్నుంచే ఆస‌క్తి క‌లుగుతోంది.

పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్న ముగ్గురు పిల్ల‌లతో పాటు, మ‌రో రెండు ముఖ్య పాత్ర‌లు ఈ సినిమాలో ఉంటాయి. త్వ‌ర‌లో హీరో హీరోయిన్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.ఎమ్‌. పాషా అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. మార్క్ కె. రాబిన్ సంగ‌తం స‌మ‌కూరుస్తుండ‌గా, దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: స‌్వ‌రూప్ ఆర్ఎస్‌జె
నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌: ఎన్‌.ఎమ్‌. పాషా
బ్యాన‌ర్‌: మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
సినిమాటోగ్ర‌ఫీ: దీప‌క్ య‌ర‌గ‌ర‌
మ్యూజిక్: మార్క్ కె. రాబిన్‌
ఎడిటింగ్‌: ర‌వితేజ గుర‌జాల‌
ఆర్ట్‌: నాగేంద్ర‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

 

 

 

 

 


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved