pizza

Pawan Kalyan is instrumental in Mogilayya’s Padma Sri
‘భీమ్లా నాయక్’తో మొగిల‌య్య‌కు గుర్తింపు తీసుకొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

You are at idlebrain.com > news today >
Follow Us

26 January 2022
Hyderabad

Mogilaiah - a Kinnera instrument artist from Telangana is found by Pawan Kalyan. He became an overnight star when he rendered the opening part of Bheemla Nayak title song. Pawan Kalyan has also financially helped him by handing over a cheque for Rs. 2 lakhs.

The Indian government has conferred him with Padma Sri now! Pawan Kalyan has played a big part in it. It all happened in just one year for Mogulayya - from obscurity to national recognition. This incident has proved how cinema can change the lives of true artists.

‘భీమ్లా నాయక్’తో మొగిల‌య్య‌కు గుర్తింపు తీసుకొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

కేంద్ర ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి 26 సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల్లో తెలుగు వ్య‌క్తి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన మొగిల‌య్య ఒక‌రు. ఈయ‌నది నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట.. 12మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరి తరం కళాకారుడు.. మొగిల‌య్య‌. సీఎం కేసీఆర్ ఈ క‌ళ‌ను గుర్తించి పురస్క‌రించారు. ఆ త‌ర్వాత మొగిల‌య్య‌కు మరింత గుర్తింపు తెచ్చి పెట్టింది మాత్రం జ‌న సేనాని.. ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనడంలో అతిశ‌యోక్తి లేదు. ఆయ‌న త‌న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయ‌క్‌’ చిత్రంలో పాట‌ను పాడించారు. ఆ పాట‌కు చాలా మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో మొగిల‌య్య గురించి మ‌రింత ఎక్కువ మందికి ముఖ్యంగా సామాన్యుల‌కు తెలిసింది.

పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోని స్థాయి నుంచి మొగిల‌య్య‌నుసెల‌బ్రిటీగా మార్చేసిన వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మారుమూల ప‌డిపోయి ఎవ‌రూ గుర్తించ‌కుండా ఉంటే క‌ళ‌కు విలువ లేద‌ని భావించి త‌న సినిమాలో పాట పాడే అవకాశాన్ని క‌ల్పించి మంచి రెమ్యున‌రేష‌న్ ఇచ్చి ఆర్థికంగా త‌న వంతు సాయాన్ని అందించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

భీమ్లా నాయ‌క్‌లో మొగిల‌య్య‌తో పాట పాడించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది? అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌ను ప్ర‌శ్నించగా ఆ క్రెడిట్ అంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌దేన‌ని ఆయ‌న తెలిపారు. మొగిల‌య్య‌తో పాట పాడించాల‌ని త్రివిక్ర‌మ్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచించార‌ట‌. త్రివిక్ర‌మ్ ఆ విష‌యాన్ని త‌మ‌న్‌కు చెప్పారు. ఇంకేముంది త‌మ‌న్ మొగిల‌య్య‌ను ప్ర‌త్యేకంగా పిలిపించి ‘భీమ్లా నాయక్’లో పాటను పాడించారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved