pizza
Mohabbat Mein release on 25 March
"మోహబ్బత్ మె" 25 న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

21 March 2016
Hyderaba
d

కార్తీక్ ,హామిద జంటగా యస్ .యమ్.సూర్య దర్శకత్వంలో ఆశ్రిత్ మూవీస్ పతాకంపై రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం"మోహబ్బత్ మె".

ఈ చిత్రం గురించి దర్శకుడు యస్ .యమ్.సూర్య మాట్లాడుతూ అమ్మ ప్రేమకు విలువ చెప్పే అందమైన ప్రేమకథా చిత్రం అని అన్నారు.ఆదిత్య మ్యూజిక్ ద్వార విడుదలైన ఆడియో సూపర్ హిట్ అయ్యిందని అన్నారు.గత కొంత కాలంగా ప్రముఖ మీడియాలో పనిచేసిన సూర్య సినిమా మీద మక్కువతో ఈ సినిమాకు దర్శకత్వం వహించానని తెలిపారు. ఈ చిత్రం అందరు మెచ్చే కుటుంబ కథాచిత్రంగా ఉంటుందని .మోహబ్బత్ మె 25 న విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నట్లు వారు తెలిపారు.

కో- ప్రొడ్యూసర్ సైదులు బాబు మాట్లాడుతూ సినిమా చూసినంతసేపు ప్రేక్షకుడు హాయి గా ఫీల్ అవుతాడు .సెన్సార్ సభ్యులు సినిమాను చూసి మెచ్చుకున్నారు.యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రక్షకుల ముందుకు తిసుకువస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉందని,ఈ సినిమాకు యస్ .యమ్.సూర్య టేకింగ్ చాల బాగుంది.ఈ సినిమా తనకు దర్శకుడిగా మంచి పేరు సంపాదించి పెడుతుందని ఆశాబావం వ్యక్తం చేశారు.

ఈ చిత్రం లో కార్తీక్ ,హామిద,కొండవలస,అనితనాథ్ ,గబ్బర్సింగ్ బ్యాచ్,పవన్ కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమరా: శ్రీకాంత్ ,సంగీతం:మీనాక్షి బుజంగ్,మేకప్:మనోహర్,ఎడిటింగ్:మేనగ శ్రీను,కో- ప్రొడ్యూసర్ సైదులు బాబు,ప్రొడ్యూసర్:రవిశంకర్,కథ - మాటలు - స్క్రీన్ ప్లే -దర్శకత్వం:యస్ .యమ్.సూర్య.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved