pizza
Mounam talkie completed
You are at idlebrain.com > news today >
Follow Us

23 October 2015
Hyderabad

టాకీ పార్ట్‌ పూర్తి చేసుకున్న మౌనం (వాయిస్‌ ఆఫ్‌ సైలెన్స్‌)

లాస్‌ ఏంజిల్స్‌ టాకీస్‌, సంధ్యా సినీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మౌనం'. కిషన్‌ సాగర్‌.ఎస్‌ దర్శకత్వంలో మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం టాకీపార్ట్‌ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్‌, సంధ్యారవి లు మాట్లాడుతూ..'' ఇదొక డిఫరెంట్‌ జోనర్‌లో సాగే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ఇది. 'మౌనం' సినిమాకి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఇంపార్టెంట్‌. దీనికి శ్రీలేఖ గారైతే న్యాయం చేస్తారని భావించి..ఆమెను అప్రోచ్‌ అయ్యాము. ఆమె ఈ సబ్జెక్ట్‌ విని ఎంతో ఎంగ్జయిటీి ఫీలయ్యారు. అలాగే 'శివ' ఫేమ్‌ చిన్నా గారు ఓ అత్యద్భుతమైన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మా డైరెక్టర్‌గారు..గతంలో బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా నేషనల్‌ అవార్డ్సును పొందారు. ఆయన ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టాకీ పూర్తయింది. త్వరలో కొలంబోలో పాటల చిత్రీకరణ జరుపనున్నాం..'' అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బలుసు రామారావు, కథ: అనిల్‌ కె. నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి,
నిర్మాతలు: అల్లూరి సూర్యప్రసాద్‌, సంధ్యారవి,
దర్శకత్వం-డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: కిషన్‌సాగర్‌. ఎస్‌


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved