pizza
Birthday Glimpse To Introduce Mrunal Thakur As 'Lieutenant' RAM’s Sita In Dulquer Salmaan’s Film
దుల్కర్ సల్మాన్ చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్‌.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా గ్లింప్స్ విడుద‌ల
You are at idlebrain.com > news today >
Follow Us

02 Aug 2021
Hyderabad

Bollywood actress Mrunal Thakur who earned a name for herself with her performance in films like Hrithik Roshan’s Super 30, John Abraham's Batla House and most recently Farhan Akhtar’s Toofaan is making her entry in Telugu opposite versatile actor Dulquer Salmaan in his second straight film being directed by Hanu Raghavapudi.

While Dulquer Salmaan plays the role of 'Lieutenant' RAM, Mrunal Thakur will be seen as his lady love Sita. Character introduction glimpse has been revealed today, on the occasion of Mrunalini Thakur’s birthday.

The glimpse shows Dulquer Salmaan clicking a beautiful picture of Mrunal Thakur. Both look eye-to-eye and appear fresh on screen. The romantic chemistry between the two is sure to win the hearts.

Mrunal Thakur who proved her mettle in Bollywood is expected to make it big in Tollywood as well. Let’s wish her a happy birthday.

While Dulquer’s first look and glimpse garnered lots of craze on the film, the glimpse of Mrunal Thakur as Sita takes the expectations to next level.

The film is produced by Ashwini Dutt and Priyanka Dutt under Swapna Cinema, while Vyjayanthi Movies presents it.

Known for making heart-touching romantic entertainers, Hanu has picked yet another intriguing subject for Production No 7 of Swapna Cinema.

The big-budget film is being made simultaneously in Telugu, Tamil and Malayalam languages.

The makers have wrapped up an extensive shooting schedule in Kashmir.

Cast: Dulquer Salmaan

Technical Crew:
Director: Hanu Raghavapudi
Producers: Ashwini Dutt, Priyanka Dutt
Banner: Swapna Cinema
Presents: Vyjayanthi Movies
DOP: PS Vinod
Music Director: Vishal Chandrasekhar
Editor: Kotagiri Venkateswara Rao
Production Design: Sunil Babu
Art Director: Vaishnavi Reddy
Costume Designer: Sheetal Sharma
PRO: Vamsi-Shekar

దుల్కర్ సల్మాన్ చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్‌.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా గ్లింప్స్ విడుద‌ల

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా సినిమా బ్యాన‌ర్స్‌పై అశ్వినీ ద‌త్‌, ప్రియాంక ద‌త్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. కాగా.. ఈ రాముడి స‌ర‌స‌న సీత‌గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ న‌టిస్తోంది. హృతిక్ రోష‌న్ ‘సూపర్ 30’, జాన్ అబ్రహం ‘బాట్లా హౌస్’.. పర్హాన్ అక్తర్ ‘తుపాన్’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి మెప్పించిన మృణాల్ తొలిసారి ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

ఆదివారం మృణాల్ ఠాకూర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఆమె చేస్తున్న సీత పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అద్దంలో నుంచి మృణాల్ ఠాకూర్ ఫొటోను తీస్తున్న దుల్క‌ర్ స‌ల్మాన్‌.. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకునేలా ఉన్న ఆ లుక్ స్క్రీన్‌పై ఓ ఫ్రెష్ అప్పియ‌రెన్స్‌నిస్తుంది. వీరిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో త‌నెంటో ప్రూవ్ చేసుకున్న మృణాల్ ఠాకూర్‌కి ఇది టాలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ అని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన దుల్క‌ర్ స‌ల్మాన్ ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచింది. ఇప్పుడు మృణాళిని గ్లింప్స్ ఈ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచాయి. రొమాంటిక్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన శైలిని చాటుకున్న ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్రేమ కోణాన్ని చూపించ‌బోతున్నారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ నిర్మిస్తోన్న 7వ చిత్ర‌మిది. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గానే ఈ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

న‌టీన‌టులు:
దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: హ‌ను రాఘ‌వ‌పూడి
నిర్మాత‌లు: అశ్వినీ ద‌త్‌, ప్రియాంక ద‌త్‌
బ్యాన‌ర్‌: స్వ‌ప్నా సినిమా
స‌మ‌ర్ప‌ణ‌: వైజ‌యంతీ మూవీస్
సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌
మ్యూజిక్‌: విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌
ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: సునీల్ బాబు
ఆర్ట్‌: వైష్ణ‌వి రెడ్డి
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: శీత‌ల్ శ‌ర్మ‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved