pizza
Mumbai 125 km 3D movie release on 26 September
You are at idlebrain.com > news today >
Follow Us

15 July 2014
Hyderabad

సెప్టెంబర్ 26న 'ముంబై 125 కి.మీ'

వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా ముఖ్య తారలుగా 'వస్తాడు నా రాజు ' ఫేం హేమంత్ మధుకర్ స్వీయదర్శకత్వం లో రూపొందుతోన్న భారీ 3 డి హారర్ చిత్రం 'ముంబై 125 కి.మీ'. సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి ఓ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 26 న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ్ బాష ల లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ - ''ఆగస్ట్ లో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రానికి స్వర బ్రహ్మ్హ మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ అవుతుంది'' అని చెప్పారు.

నిర్మాత మణిశర్మ మాట్లాడుతూ - ''భారత దేశంలో మొట్ట మొదటిసారిగా రియల్ 3డీ మరియు డాల్బీ అత్మొస్ సౌండ్ సంయుక్త టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది'' అని తెలిపారు.

వీణా మాలిక్, కరణ్ వీర్ బోరా, వెడిత ప్రతాప్ సింగ్, అపర్ణ బాజ్ సాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత - మణిశర్మ , హేమంత్ మధుకర్, స్టోరీ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - హేమంత్ మధుకర్


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved