pizza
My movie: Jyo Achyutananda by Tanmayi
చాలా అరుదుగా మంచి సినిమా చూసే అవకాశం వస్తున్న రోజులు
You are at idlebrain.com > news today >
Follow Us

9 September 2016
Hyderaba
d

"ఊహలు గుసగుసలాడే" సినిమా classic comedyకి తెగ మురిసిపోయి DVD కొనేసి చూస్తున్న తెలుగు సరస హాస్య ప్రియులూ, సున్నిత హ్రుదయులూ, భాషాప్రాసాభిమానులూ నిస్సంకోచంగా సకుటుంబంగా చూడదగ్గ సినిమా 'జ్యో అచ్యుతానంద’.

రెండో సినిమానే పరిశ్రమ పర్యవేక్షించే అనుభవం లేని అవసరాల దర్శక ప్రతిభకు నిదర్శనం. పరిసరాలు సూక్ష్మంగా గమనించే కన్నూ, సిరా సరిగ్గా ఉన్న పెన్నూ ఉంటే చాలు అని నిరూపించిన చిత్రం.

ప్రతి క్షణం వినోదం ఉన్నా, కధ ఏమిటి అంటే ఎలా చెప్పాలో తెలియక తడుముకున్నది అప్పుడెప్పుడో screenplay సత్తాతోనే నడిచిన 'క్షణక్షణం' సినిమాకి. ఇప్పుడు మళ్ళీ "జ్యో అచ్యుతానంద" కి.

ఇద్దరు హీరోస్ , ఒక హీరోయిన్ కనబడుతున్నారు కదా Triangle love storyనా అంటే..కాదు.

సినిమా ఆద్యంతం నవ్వొస్తుంది కదా..కామెడీనా అంటే ..కాదు.

రొమాన్స్ ఉందా అంటే, లేదు..లేదా ఖచ్చితంగా అంటే, ఉంది.

మసాలా డ్రామానా అంటే, పక్కింటి లో జరిగే తంతులాగా ఉంది.

ఇంటి పక్క భాగోతంలో variety ఏముంటుంది routine కదా అంటే ఊహించని మలుపులు కనీసం ఐదు ఉన్నాయి.

ఏడు పాత్రల మధ్య దిక్కుమాలిన మొరటు duets లేని అంతర్లీన ప్రేమ వ్రుత్తాంతం ఇలా సాధ్యమయ్యింది అంటే ఆ script వెనక ఎంత మేధోమధనం ఉండాలి? భారీ సన్నివేశాలకి భారీ dialogues అనే Tollywood మంత్రం కాకుండా హీరొల అమాయకపు మాటలాకే నవ్వు పుట్టాలంటే కధాగమనానికి ఎంత పదును ఉండాలి?

Trailerతో ఎలాగో curiosity స్రుష్టించారు,సినిమా చూసేసాక review రాయాలన్నా ఇంత confusionగా ఉంది అంటే కధ ఎంత పకడ్బందీగా execute చేసారో అర్ధం ఔతుంది.

దర్శకత్వం, సంగీత దర్శకత్వం ఇద్దరు విడి వ్యక్తులు చేసారంటే నమ్మకం కుదరట్లేదు. BGMగానీ, Foregroundలో కధలో కలిసిపోయిన సంగీతం గానీ ఎంత బావుందంటే - ఏ సీనునీ, ధ్వనినీ విడదీసి ఊహించలేము.
Titlesకీ, climaxకీ, emotional scenesకీ (ముఖ్యంగా love letter సీన్ కీ ) ప్రణాళిక ప్రకారం తిరిగి వాడకుండా వాడిన వాయిద్యాల హోరు అమోఘం. Sree Kalyan Ramana👏

over action లేదు, over makeup లేదు, over dramatization & dialogues లేవు. కోడళ్ళ లాంటి చిన్న పాత్రలతో సహా అందరి మొహాలూ, నటనా అమోదయోగ్యంగా ఉన్నాయి. అవసరమైన పాత్రలే తప్ప తెర హంగుకోసం ఎవరూ లేరు.

Interviewsల్లో తప్ప నిజంగా సినిమాలో simplicity చూపించడం రాని దర్శకులంతా చూసి ఖరారుగా నేర్చుకోవాలి - కధనంలో దమ్ము ఉంటే అత్యంత low budgetలో సినిమా తీయొచ్చనీ, కలంలో బలం ఉంటే మిగతావన్నీ మలచదగ్గవనీ.

మొదటి ముప్ఫై నిమిషాల్లోనూ, చివరి ముప్ఫై నిమిషాల్లోనూ, Interval దగ్గిరా కధ వేగంగా ఉంది, ఊహాతీతంగా ఉంది.

టెన్నిస్ జోకులు, శుక్రుడి జ్యోతిష్య ప్రస్తావన, అన్నదమ్ముల విసుర్లు, కోడళ్ళ అల్లరి,సంబోధన ప్రధమా విభక్తి , వెర్రెస్ట్ second వెధవ, గిచ్చబడడం, తత్కాల్passport ముళ్ళపూడి చతురతని గుర్తు తెచ్చాయి.

హీరోలిద్దరి ప్రతిబింబం అద్దంలో కధానుగుణంగా ఒకేసారి రావడం లాంటి సునిశితమైన గమనింపు excellent.

షూటింగ్ లో bloopersని నిజంగా వాడేసుకోవడం, హీరోలిద్దరి చేతా పాడించెయ్యడం, 'hexagon love story' ప్రయోగాలు మనోరంజకం.

Trailer తాలూకు confusion విడివడుతోంది హమ్మయ్య అనుకునే లోగా ఒకటి, రెండు, మూడు వైపుల కధలూ ఒకేసారి చూపించి కూడా confusion లేని తిరకాసు పెట్టడం మహా రంజుగా ఉంది.

నాగశౌర్య నిజంగానే chupE rustum.
గంతులేస్తూ చిన్న పిల్లాడిలా నవ్వుతూనే, కంట తడి తను పెట్టినప్పుడు మన చేత కూడా పెట్టించగలడు - రుజువైంది. డాన్స్ బ్రహ్మాండంగా చేశాడు, డైలాగ్స్ లో కాస్త వేగం తగ్గించి స్పష్టత పెంచాలి. ‘సువర్ణ' పాట మగ గొంతు శౌర్యకి నప్పలేదు.

రోహిత్ అత్యంత బాగా నచ్చిన సినిమా "సోలో". తరువాత ఇదే. ఎంత చక్కటి కామెడీ టైమింగ్, పరిపక్వమైన నటన, తత్తరపాటూ తొందరపాటూ లేకుండా స్పష్టంగా అర్ధం అయ్యేలా ఉన్న ఉచ్చారణ (ఒక్క 'ళ విషయంలో తప్ప) , డాన్స్ ప్రయత్నం అభినందనీయం కానీ కుదరలేదనిపించింది.

"ఆహాహా బాగున్నది" పాట happy and sad version చాలా బావుంది visualsతో చూస్తే.
"ఒక లాలన" పాట backgroundలో రావడం వల్ల పండింది గానీ foregroundలో shankar mahadevanగారి matured voice హీరొలిద్దరి లేత గాత్రాలకీ సరిపడేది కాదేమో !ఆ పాటలో గాంభీర్యం, మాధుర్యం ఉన్నాయి.
కానీ శ్రీ కళ్యాణరమణ పాడిన title songలో ఆర్ద్రత ఉంది కాబట్టి నా వోటు రెండోదానికే :)

భాస్కరభట్లగారి సాహిత్యం కర్ణపేయం గానే ఉంది.

నా ద్రుక్కోణంలో తేడానో ఏమో బాపు, జంధ్యాల, విశ్వనాధ్ గార్ల పది పన్నెండు కధల Style విచిత్రంగా ఈ సినిమలో సభ్యంగా, అనూహ్య రీతిలో ఒక్కటిగా ఒదిగినట్టు అనిపించింది సినిమా ముగిసాక, కానీ కధ కొత్తదే.
అది పొగడ్తే.

మొన్నెప్పుడో త్రివిక్రం సినిమా ఒకటి చూసి నిరుత్సాహ పడిపోయి, ఆద్యంతం "ఇది త్రివిక్రం సినిమాయే" అని అభిమానంతో గుర్తు చేసుకుంటూ చూడల్సొచ్చింది.

"జ్యో అచ్యుతానంద" మాత్రం "ఇది నేను అసాధారణ ప్రగ్న్య ఉన్న సినిమా రచయితలని నమ్మే ముళ్ళపూడి, త్రివిక్రంలు dialogues రాసిన సినిమా కాదు" అని గుర్తు చేసుకుంటూ చూడాల్సొచింది. ఇదీ పొగడ్తే :)

శ్రీనివాస్ అవసరాల మొహానికి ఏదో అంటుకుంది, తుడుచుకుంటే పోనిది - చెదరని చిరునవ్వు.
నివురు గప్పిన నిప్పులాంటి సమర్ధత, Hollywood takingని Tollywoodలో హద్దులు దాటకుండా కలబోయగల నైపుణ్యం
ఉన్న ఈ ప్రతిభాశాలికి, తుడుచుకుంటే పోని అద్రుష్టం పట్టాలని, ప్రేక్షకులు పట్టం కట్టాలని ఆశ, ఆశీర్వాదం.

The most cleanest ever feel-good entertainer rate-able 4.4/5
(if OOHALU GUSAGUSALADE was 3.5/5). Do not miss it!

మరీ ఎక్కువ పొగిడేస్తే, ఇదిగో దిష్టికి - Ratingలో 0.6 కోతకి దోహద పడిన చిన్న విషయాలు (5కి 5 వెయ్యాలంటే అసలే చేతులు రావు) -

1) సందర్భం తెలియనివ్వకుండా titles సమయంలో అకస్మాత్తుగా మొదలయ్యిన ఇళయరాజా పాటలు (శ్రీ కళ్యాణ రమణగారి పాత పాటలు వచ్చినా సందర్భోచితం, సమయోచితం)
2) ‘ళ' బదులు ‘ల’ పలికిన కొన్ని పాత్రలు
3) మొదటి ముప్ఫై నిమిషాల తరువాత అర్ధం అయిన కధాదారం వల్ల వేగం
తగ్గినట్టు అనిపించిన నడక.

కొత్తదనం లేని అంశాలు/నిజాలు -

రెజినా చాలా అందంగా ఉంది
Music పరమ భేషుగ్గా ఉంది
రోహిత్-శౌర్య chemistry అదిరిపోయింది
అపహాస్యం కాని హాస్యం దివ్యంగా ఉంది
అవసరాల తెర మీద కనపడని లోటు తెలిసింది
climax surprise element అబ్బురపరిచింది

Clean language, Clear Rhyming, subtle humor, innovative story, unpredictable twists, unique creativity, melodious music, finest screenplay, tickling dialogues, emotional climax, no nonsense drama, mind-blowing surprise element!

It has them all : JYO ACHYUTANANDA! KudOs తో కూడిన వీరతాడు కి అర్హులు Sri Avasarala👏

"క్షణం" లాంటి thrillerలోనే కాక సామాన్యమైన simple storyలో కూడా gripping screenplay సాధ్యమని ఏకీభవిస్తున్నాను. Ofcourse, నా ఏకాభిప్రాయం, లోకాభిప్రాయం కానక్కర్లేదు!

- Tanmayi

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved