pizza
Naga Anvesh about Angel
ముందు ఆలోచించాం - నాగ అన్వేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

2 November 2017
Hyderabad

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సోషియో ఫాంట‌సీ విజువల్ వండర్ 'ఏంజెల్'. రాజమౌళి శిష్యుడు `బాహుబలి` పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతుంది.

ఈ సంద‌ర్భంగా హీరో నాగ అన్వేష్ మాట్లాడుతూ -```ఏంజెల్` సినిమా నవంబ‌ర్ 3న `ఏంజెల్` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ విన‌డం ద‌గ్గ‌ర నుండి, ఫైన‌ల్ అవుట్‌పుట్ చూసి..కొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు చేసే దాకా వి.వి.వినాయ‌క్‌గారు చేసిన స‌పోర్ట్ మ‌ర‌చిపోలేను. ఎడిటింగ్‌లో కూడా ఆయ‌న స‌పోర్ట్ అందించారు. అలాగే వాయిస్ ఓవ‌ర్ కూడా ఇచ్చారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే..ఏడాదిన్న‌ర పాటు స్క్రిప్ట్ వ‌ర్క్ చేసిన త‌ర్వాత షూటింగ్‌కు వెళ్లాం. నాలుగు నెల‌లు చిత్రీక‌ర‌ణ చేసుకున్నాం. ఆ త‌ర్వాత ఆరు నెల‌లు గ్రాఫిక్ వ‌ర్క్ చేశాం. స్టోరీలో కొత్త‌ద‌నం, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్ర‌ధానంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. ఫ‌స్ట్ కాపీ చూసిన త‌ర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమాపై న‌మ్మ‌కంతో డిస్ట్రిబ్యూటర్స్‌కు సినిమాను చూపించాం. వాళ్లంతా కూడా హ్యాపీగా ఫీల‌య్యారు. ఏంజెల్ నా రెండో సినిమా. ఇంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాలంటే క‌ష్ట‌మే క‌దా! అని ఆలోచించాం. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒక మంచి సినిమా వ‌స్తే ప్రేక్ష‌కులు చ‌క్క‌గా ఆద‌రిస్తున్నారు. యు.ఎస్‌లో ప్రేక్ష‌కులు సైతం స్టోరీలైన్ బావుంటే కొత్త హీరోల సినిమాలు కూడా చూస్తున్నారు. అదే కాన్ఫిడెన్స్‌తో సినిమా చేశాం. నేను, స‌ప్త‌గిరి అన్న..ఇద్ద‌రం స్మ‌గ్ల‌ర్స్‌. పురాత‌న విగ్ర‌హాల‌ను రాష్ట్ర స‌రిహ‌ద్దులు దాటిస్తుంటాం. అలా ఓసారి ఓ విగ్ర‌హాన్ని దొంగిలించి వ‌స్తుంటే, మాకు హెబ్బా ప‌టేల్ జ‌త క‌లుస్తుంది. అనుకోకుండా, మేం తెచ్చే విగ్ర‌హం మాయ‌మ‌వుతుంది. అస‌లు విగ్ర‌హానికి, స్వ‌ర్గ లోకానికి సంబంధం ఏంటి? ఇవ‌న్నీ కామెడీ పంథాలో సాగుతుంది. సీజీ ఎలా ఉంటుందోన‌ని భ‌య‌ప‌డ్డాను. కానీ అద్భుతమైనీ సీజీ వ‌ర్క్ వ‌చ్చింది. తెలుగులో సినిమాను ముందుగా విడుద‌ల చేస్తున్నాం. త‌ర్వాత త‌మిళంలో కూడా విడుద‌ల చేస్తాం. హిందీలో కూడా సినిమాను విడుద‌ల చేస్తామ‌ని అడుగుతున్నారు. ప‌ళ‌నిగారు `బాహుబ‌లి`, `రుద్ర‌మ‌దేవి` చిత్రాల‌కు ప‌నిచేశారు. ఆయ‌న‌కు గ్రాఫిక్స్‌పై మంచి ప‌ట్టుంది. ఆయ‌నకు ఏం కావాల‌నే విష‌యంపై అవ‌గాహ‌న ఉండ‌టంతో ఎక్క‌డా, ఏ స‌మ‌స్యా రాలేదు. నాన్న‌గారు నిర్మాతగా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక త‌దుప‌రి చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ ఫైన‌లైజ్ అయ్యింది. బ‌య‌ట బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా చేసే అవకాశాలున్నాయి`` అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved