pizza
Film Actor Nagarjuna requested all people to participate in Koti Vriksharchana:
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటుదాం ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పిలుపు
You are at idlebrain.com > news today >
 
Follow Us

14 February -2021
Hyderabad




Film Actor Nagarjuna stated that Global warming is the biggest menace on earth today and recent Uttarkhand disaster can be attributed to the Global warming.

Nagarjuna felt that the initiation of Green India Challenge taken by Rajya Sabha MP Joginapally Santhosh Kumar is the answer to the problem.

He requested all people to actively participate in plantation of 1 Cr saplings within 1 hour on the occasion of Honourable CM KCR birthday ie on 17-02-2021 between 10 am to 11:00 in fillufiling the Vision of Green Telangana.


మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17 న ఒక రోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేద్దాం అని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు.

గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశానికి, ప్రపంచానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఈ మధ్యనే మనం చూశాం ఉత్తరాఖండ్ లో జరిగిన వరదల వల్ల చాలామంది ప్రజలు చనిపోవడం జరిగిందని. కాబట్టి బాధ్యత గల పౌరులుగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మనం కూడా ఏదైనా ఒకటి చేయాలని అనే ఉద్దేశంతో అది కూడా ఒక ప్రత్యేకమైన రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఒకరోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఆకుపచ్చ తెలంగాణ గా చేయడం జరిగిందని. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా అందరం పాల్గొని విజయవంతం చేయాలని అదే ముఖ్యమంత్రి గారికి మన తరపున హరిత కానుక అని తెలిపారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

 

 


 

 

 


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved