pizza
సత్య ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం:1
'జాదూగాడు' గా నాగశౌర్య..!
You are at idlebrain.com > news today >
Follow Us

10 March 2015
Hyderabad

'చింతకాయల రవి' ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ పతాకం ఫై ఓ చిత్రం రూపొందుతోంది . ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య',లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’ ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రానికి ‘జాదూగాడు’ అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

'జాదూగాడు': మాస్ ఎంటర్ టైనర్
చిత్ర దర్శకుడు 'యోగేష్' మాట్లాడుతూ..' కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రం లోఅతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో కధానాయకుడి పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని తెలిపారు. వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ 'జాదూగాడు' అన్నారు.

ఏప్రిల్ లో 'జాదూగాడు' విడుదల:
పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు’ షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ నెలలోనే చిత్రం ఆడియో, ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.

ప్రధాన తారాగణం :
కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ,‘అదుర్స్’ రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం :
సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్ ,ఎడిటర్: యం.ఆర్.వర్మ: ఆర్ట్ : సాహి సురేష్ ; ఫైట్స్ : వెంకట్ ; కథ , మాటలు : మధు సూదన్; పాటలు : వరికుప్పల యాదగిరి , శ్రీమణి

నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్
స్క్రీన్ ప్లే , దర్శకత్వం : యోగేష్

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved