pizza
Naga Shourya - Srinivas Avasarala - T.G. Viswa Prasad New Film
నాగసౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

2 March 2019
Hyderabad

Naga Shaurya & Malavika Nair paired up in a film under the direction of Avasarala Srinivas, produced jointly by People Media Factory and Dasari Productions.

Young hero Naga Shaurya and talented actress Malavika Nair are yet again paired up in the forthcoming film which will be directed by multifaceted persona Avasarala Srinivas. Noted production house People Media Factory and Dasari Productions are set to bankroll this movie jointly.

Earlier, the duo Naga Shaurya & Malavika Nair appeared onscreen together in Kalyana Vaibhogame and won huge accolades. Also, the director Avasarala Srinivas has directed Naga Shaurya in Oohalu Gusagusalade & Jyo Achyutananda. So, now the successful combination is set to repeat and entertain the audience the most. It’s very overwhelming and happy to produce a film with such a talent. The shooting will begin in march 2nd week. Soon we will unveil the details of other cast and crew, says producer’s TG Vishwa Prasad, Dasari Padmaja and Co- Producer Vivek Kuchibotla

నాగసౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం

విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు...వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది.

ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది.దీనిని, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ 'దాసరి ప్రొడక్షన్స్' తో కలసి నిర్మించబోతోంది.
వివరాల్లోకి వెళితే...

ఆమధ్య యువ కథానాయకుడు నాగసౌర్య ,మాళవిక నాయర్ జంటగా రూపొందిన 'కళ్యాణ వైభోగమే' చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే 'నాగసౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే.

ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగసౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved