pizza
Naira Shah about E Ee
`ఇఈ` మెప్పించే రొమాంటిక్ చిత్రం - నైరా షా
You are at idlebrain.com > news today >
Follow Us

11 December 2017
Hyderabad

నీరజ్‌ శ్యామ్‌, నైరా షా జంటగా నటించిన చిత్రం 'ఇ ఈ'. రామ్‌ గణపతిరావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవబాల క్రియేషన్స్‌ పతాకంపై లక్ష్మణ్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో హీరోయిన్‌ నైరా షా మాట్లాడుతూ ''నేను ముంబయ్‌ నుంచి వచ్చాను. నాకు కుంగ్‌ఫూ తెలుసు. నేను కిక్‌ బాక్సర్‌ని. నేషనల్‌ లెవల్‌ ఛాంపియన్‌ షిప్‌లో సిల్వర్‌ మెడల్‌ వచ్చింది. మా పేరెంట్స్‌ యాక్టర్స్‌ అవ్వాలని బీహార్‌ నుంచి ముంబయ్‌ వచ్చారు. కానీ, వాళ్ళ కోరిక తీరలేదు. నన్నయినా హీరోయిన్‌గా చూడాలన్నది వారి కోరిక. వారి కోరిక తీర్చ‌డానికి నేను అనుప‌మ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో క్రాష్ కోర్సులో జాయిన్ అయ్యాను. త‌ర్వాత థియేట‌ర్స్ కోర్సులో జాయిన్ అయ్యాను. కొన్ని రోజుల త‌ర్వాత సీరియ‌ల్స్‌లో న‌టించే అవకాశం వ‌చ్చింది. అయితే సీరియ‌ల్స్ చేయాల‌నేది నా ఆలోచ‌న కాదు. దాంతో సీరియ‌ల్స్‌ను విడిచిపెట్టేశాను. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో రాణించాల‌నుకున్నాను. అయితే అది అనుకున్నంత సుల‌భం కాద‌ని నాకు తెలుసు. స్టార్ పిల్లలైనా ఉండాలి, గాడ్‌ఫాద‌ర్ అయినా ఉండాలి. దాంతో నేను ద‌క్షిణాదిన హీరోయిన్‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం మొద‌లు పెట్టాను.

అప్పుడు ఈ సినిమా డైరెక్టర్‌ నన్ను ఆడిషన్‌కి పిలిచారు. 450 మంది అమ్మాయిల్లో నేను సెలెక్ట్‌ అయ్యాను. బొమ్మరిల్లు చిత్రంలో జెనీలియా నటించిన ఓ సీన్‌ ఇచ్చి నన్ను చేసి పంపమన్నారు. నాకు తెలుగు రాదు. మా పక్క బిల్డింగ్‌లో తెలుగు వాళ్ళు వుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డైలాగ్‌ మీనింగ్‌ తెలుసుకొని తెలుగు నేర్చుకొని ఆ వీడియో చేసి పంపాను. అలా ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. బొమ్మరిల్లులో జెనీలియా చేసిన క్యారెక్టర్‌ పేరు హాసిని. కాకతాళీయంగా ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌ పేరు కూడా హాసినీయే. ఏ నటికైనా ఇలాంటి క్యారెక్టర్‌ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవ్వడం అదృష్టం అని చెప్పాలి. మొదట్లో ఏరగెంట్‌గా వుండే మోడ్రన్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఆ తర్వాత హీరోతో రొమాన్స్‌ చేసే రొమాంటిక్‌ గర్ల్‌గా మారతాను. సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్‌ నువ్వే చేశావా అని అడుగుతారు. నాకు హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలనుకునే వారు నా టాలెంట్‌ గురించి అడిగితే 'ఇఈ' సినిమా చూడమని చెబుతాను. ఎందుకంటే నా క్యారెక్టర్‌లో అన్ని వేరియేషన్స్‌ వున్నాయి. నా టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్‌ వస్తే చాలు అనుకున్నాను. ఆ ఛాన్స్‌ మా డైరెక్టర్‌గారు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఆయనకు థాంక్స్‌. నీర‌జ్ చాలా మంచి కో ఆర్టిస్ట్‌. తెలుగు డైలాగ్స్ చెప్ప‌డంలో త‌నెంతో స‌హ‌కారం అందించారు. సీనియ‌ర్ యాక్ట‌ర్ సుధాక‌ర్‌గారు స‌ల‌హాలు కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి. డైరెక్ట‌ర్ రామ్ గ‌ణ‌ప‌తిరావుగారు నాపై న‌మ్మకంతో ఓ మంచి పాత్ర‌ను నాతో చేయించారు. `ఇఈ` ఒక రొమాంటిక్ చిత్రం. కుటుంబ‌మంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుంది. ఆడియెన్స్ బాగా క‌నెక్ట్ అవుతారు. నా త‌దుప‌రి చిత్రాలు చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉన్నాయి. అంతా ఓకే అయిన త‌ర్వాత వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved