pizza
Nandita Swetha - Green India Challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి నందీత శ్వేత
You are at idlebrain.com > news today >
 
Follow Us

25 January -2021
Hyderabad

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించి నేడు గచ్చిబౌలి లో మొక్కలు నాటిన తెలుగు, కన్నడ, తమిళ సినిమాల హీరోయిన్ నందీత శ్వేత.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి తెలుసుకోని రాజ్సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా చాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని. ఈ రోజు మొక్కలు నాటడం
నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ చాలెంజ్ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరో నిఖిల్, సినిమా కల్కి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

 


 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved