pizza
Nannaku Prematho makers offer an apology
'నాన్నకు ప్రేమతో' పోస్టర్‌ వివాదంపై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ స్పందన
You are at idlebrain.com > news today >
Follow Us

9 January 2016
Hyderabad

It has come to our notice that some members of a religious community have been offended by a background image used in a song poster of Nannaku Prematho. We respect the religious sentiments of the community and have replaced the image with a new one. The offending background has also been removed from the film.We offer an unconditional apology to the members of the community for any offence caused to religious sentiments because of the background image. We have never been against any community, nor do we bear any ill will towards any community.We believe that every community has the right to live with dignity, honour, and freedom. The poster design was an accident and it was not intended as an act of malice.

'నాన్నకు ప్రేమతో' పోస్టర్‌ వివాదంపై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ స్పందన

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌లో ముస్లిం సోదరుల మనోభావాలను కించ పరిచే అంశాలున్నాయని తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ విషయంపై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - '''నాన్నకు ప్రేమతో' చిత్రానికి సంబంధించిన ఒక సాంగ్‌ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌ ముస్లిం సోదరుల మనో భావాలను కించపరిచే విధంగా వుందని మా దృష్టికి వచ్చింది. మేం అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తాం. అందుకే ఆ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌ని తొలగించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశాం. అలాగే సినిమాలోని ఆ సాంగ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చేస్తున్నాం. మేం విడుదల చేసిన పోస్టర్‌ వల్ల ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి మేం బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. వారి మనోభావాలను దెబ్బతియ్యాలనికానీ, వారికి చెడు తలపెట్టాలని కానీ మా ఉద్దేశం కాదు. అన్ని మతాల వారికి స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కు వుంది. ఆ పోస్టర్‌ అనుకోకుండా వచ్చిందే తప్ప ముస్లిం సోదరులను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో రిలీజ్‌ చేసింది కాదు'' అన్నారు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved