pizza
Nanna Nenu Varsha coming soon
త్వరలో రాబోతున్న 'నాన్న.. నేను.. వర్ష..!'
You are at idlebrain.com > news today >
Follow Us

3 February 2016
Hyderaba
d

ఆదర్శ్‌బాబు, పావని హీరో హీరోయిన్లుగా 'శ్రీ ఓం డి ఆర్ట్‌ క్రియేషన్స్‌' పతాకంపై అజ్మేర చందు దర్శకత్వంలో ఎఎస్‌ రావు నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'నాన్న.. నేను.. వర్ష..!'. నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌కాపీ ఫిబ్రవరి 10న రెడీ అవ్వబోతోంది. ఈ ఫిబ్రవరి నెలలో ఆడియోని, మార్చి మొదటి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు అజ్మేర చందు చిత్ర విశేషాలను తెలియజేస్తూ... పది సంవత్సరాల క్రితం సినిమా డైరెక్టర్‌ని అవ్వాలనే పట్టుదలతో ఇండస్ట్రీకొచ్చాను. కన్నడ, తెలుగు సినిమాల్లో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్స్‌లో వర్క్‌ చేసాను. ఆ తర్వాత అనుకోకుండా నూతన నిర్మాత ఎఎస్‌రావు గారికి నేను చెప్పిన పాయింట్‌ నచ్చడంతో పూర్తి కథను రెడీ చేసి వినిపించాను. ఆయనకు నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వచ్చింది. ఈ కథకు కావాల్సిన బడ్జెట్‌ను అందజేసారు. కథకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో కొత్త హీరోను పరిచయం చేస్తున్నాము. మా హీరో ఆదర్శ్‌బాబు కొత్త హీరోలా కాకుండా ఎంతో అనుభవమున్న ఆర్టిస్ట్‌లా నటించాడు. మన పక్కింటి అబ్బాయిలా ఈ చిత్రంలో కనిపిస్తాడు. క్లాస్‌, మాస్‌ ఆడియన్స్‌ని మెప్పిస్తాడనే నమ్మకం వుంది. డ్యాన్స్‌, ఫైట్స్‌, డైలాగ్స్‌ విషయంలో మంచి ఫెర్ఫామెన్స్‌ని కనబరుస్తున్నాడు. సెట్స్‌లో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందరితో కలిసిపోయే మనస్థత్వం వున్న హీరో ఆదర్శ్‌బాబుకి ఈ చిత్రం మంచి బ్రేక్‌నిస్తుందనే నమ్మకం వుంది. ఇందులో హీరో ఆదర్శ్‌బాబు 12 గెటప్స్‌లో కనిపిస్తారు. కొత్త హీరోతో వర్క్‌ చేయడం అసాధ్యం అనుకున్న తరుణంలో ఆదర్శ్‌బాబుతో చేయడంతో ఇంకా పది మంది కొత్త హీరోలతో వర్క్‌ చేయగలననే నాకు నమ్మకం ఏర్పడింది. హీరోయిన్‌ పావని నటన చాలా అద్భుతంగా నటించింది. మిగతా నటీనటులు అందరూ బాగా నటించారు. అన్ని వాణిజ్య హంగులు వున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. త్వరలో ఫస్ట్‌కాపీ రాబోతోంది. ఇదే నెలలో ఆడియోని, మార్చి మొదటివారంలో సినిమాను విడదలకు సన్నాహాలు చేస్తున్నాము అని తెలిపారు.

ఈ చిత్రంలో ఆదర్శ్‌బాబు, పావని, బస్టాప్‌ కోటేశ్వరరావు, చలాకీ చంటి, స్నేహ, హారిక, గంగూభాయ్‌, దిలీప్‌, రాము, శివ, శోభ, శ్రావణ్‌, రఘు, మంగూలాల్‌, సమీర, అక్షయ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు విశ్వత్‌చందు, దాస్‌, ఆదిత్య, లక్ష్మణ్‌, సంగీతం: డేవిడ్‌, కెమెరా: డి.విజయ్‌కుమార్‌, ఎడిటింగ్‌: అనిల్‌రాజు, కో-డైరెక్టర్‌: కె.రాజేందర్‌, సహనిర్మాత: డి.అంజినాయక్‌, నిర్మాత: ఎఎస్‌ రావు, రచన-దర్శకత్వం: అజ్మేర చందు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved