2016 లో అన్నీ ఉన్నాయి....
- 2016 సంవత్సరంలో ఎగ్జైట్ మెంట్, సంతోషం, బాధ ఇలా అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నా తప్పులు ఏమిటో తెలుసుకున్నాను. 2017లో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే...ఒక సినిమా రిలీజ్ తర్వాతే వేరే సినిమా ఏమటి అనేది ఎనౌన్స్ చేస్తాను. ఇంతకు ముందులా వరుసగా సినిమాలు రిలీజ్ చేయకూడదు అని నిర్ణయించుకున్నాను.
`అప్పట్లో ఒకడుండేవాడు` సక్సెస్ రెస్పాన్స్.....
- నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుంది అనుకున్నాను కానీ ఇంత రెస్పాన్స్ వస్తుంది అని అసలు అనుకోలేదు. మూడు సంవత్సరాల నుండి తనయారు చేసుకున్న కథ, కాబట్టి డైరెక్టర్ సాగర్ చంద్ర స్ర్కిప్ట్ పై క్లారిటితో ఉన్నారు. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా సక్సెస్ కావడం ఇంకా ఆనందంగా ఉంది.
నేను అదేం ఆలోచించను....
- ఇంతియాజ్ అలీ అనే నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి కథ ఉన్నప్పుడు నా రోల్ తక్కువగా ఉందా, లేదా అని ఆలోచించను. పాత్ర నచ్చితే లెంగ్త్ గురించి ఆలోచించను. కథ బావుంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతాను.
Nara Rohit interviewgallery
హీరోయిన్ విషయంలో ఆలోచించాం...
- నా పాత్రకు హీరోయిన్ లేదు. హీరోయిన్‌ను తీసుకుందామా, వద్దా అని ఆలోచించడంతో సినిమా మూడు నెలల పాటు ఆలస్యం కూడా అయ్యింది. కానీ కథ ప్రకారం చూస్తే నా పక్కన హీరోయిన్ లేకుండా ఉంటేనే బావుంటుందనిపించింది.
ఆలస్యానికి కారణం...
- సినిమా జూన్‌లోనే పూర్తయ్యింది. ఆ టైమ్‌లో జ్యో అచ్యుతానంద కూడా రెడీ కావడంతో ఈ సినిమాను వాయిదా వేద్దాం. తొందర పడకుండా టైం తీసుకుని రిలీజ్ చేద్దామని అనుకున్నాను. నవంర్‌లో సినిమాను విడుదల చేద్దామని అనుకుంటే డీ మానిటైజేషన్ వల్ల సినిమాను డిసెంబర్ 30న రిలీజ్ చేయాల్సి వచ్చింది.
ఇద్దరికీ మంచి పేరు వచ్చింది....
- అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో నా పాత్రకు, శ్రీ విష్ణు పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇక శ్రీవిష్ణు హీరోగా ఈ సినిమా చేయడానికి కారణం, ఇద్దరి మధ్య ఉన్న పరిచయమే. బాణం సమయం నుండి ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం. ప్రతినిధి సినిమాలో నా పాత్రను శ్రీవిష్ణు చేయాల్సింది. కానీ నాకైతే సరిపోతుందని తనే అనడంతో ఆ సినిమాలో నేను నటించాను. అలాగే అప్పట్లో ఒకడుండేవాడు సినిమా విషయానికి వస్తే రైల్వే రాజు అనే క్యారెక్టర్ కి విష్ణు కరెక్ట్ గా సెట్ అవుతాడు అనిపించడండతో శ్రీ విష్ణు నటించాడు. చాలా కంటెంట్ ఉండే సినిమా పెద్ద సీరియల్‌నే తీయవచ్చు. నారా రోహిత్ బాగా చేయలేకపోయాడు అనిపించినా ఫరవాలేదు కానీ...సినిమా బాగుండాలి అనుకుంటాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్.....
- `కథలో రాజకుమారి` సినిమా చేస్తున్నాను. 80% సినిమా పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత పవన్ మల్లెల దర్శకత్వంలో ఓ కమర్షియల్ మూవీ చేస్తున్నాను. ఈ సినిమా కోసం జిమ్‌లో వర్కవుట్స్ కూడా చేస్తున్నాను.