pizza
Interview with Nara Rohit about Balakrishnudu
ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన `బాల‌కృష్ణుడు` ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది - నారా రోహిత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 November 2017
Hyderabad

సరస్‌చంద్రిక విజనరీ మోషన్‌ పిక్చర్స్‌, మాయా బజార్‌ మూవీస్‌ సంయుక్తంగా.. నారా రోహిత్‌-రెజీనా జంటగా డెబ్యూ డైరెక్టర్‌ పవన్‌ మల్లెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బాలక ష్ణుడు'. బి.మహేంద్రబాబు, ముసునూను వంశీ, సరస్‌చంద్రిక విజనరీ మోషన్‌ పిక్చర్స్‌ శ్రీ వినోద్‌ నందమూరి, మాయా బజార్‌ మూవీస్‌ సినిమా నిర్మాతలు. ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నారారోహిత్ సినిమా గురించి మాట్లాడుతూ - ``బాల‌కృష్ణుడు` సినిమా కోసం సిక్స్ ప్యాక్ స్టార్ట్ చేసినా, సినిమా పూర్త‌య్యే స‌రికి సిక్స్‌ప్యాక్ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. కాబ‌ట్టి సిక్స్ ప్యాక్ చూప‌లేదు. అయితే నా బాడీలో చేంజ్‌ను ప్రేక్ష‌కులు పూర్తిగా చూస్తారు. డ‌బ్బులు కోసం ఏమైనా చేసే యువ‌కుడిపాత్ర‌. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో ఉండే పాత్ర‌. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా సాగే పాత్ర‌. నా పాత్ర‌పేరు బాలు. చేసే ప‌నులన్నీ అల్ల‌రిగా ఉంటాయి కాబట్టే బాల‌కృష్ణుడ‌నే పేరు పెట్టారు. చాలా మంది కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశాను కాబ‌ట్టే, ప‌వ‌న్ మ‌ల్లెల‌తో పనిచేయ‌డం నాకు క‌ష్టంగా అనిపించ‌లేదు. ప‌వ‌న్‌కు ఏం చేయాల‌నే దానిపై క్లారిటీ ఉంది. ప్ర‌తి సీన్‌ను నాకు వివ‌రించాడు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఎంట‌ర్‌టైన్మెంట్ జోన‌ర్ నాకు కొత్త‌ కావ‌డంతో సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. కొత్త ర‌క‌మైన క‌థ‌తో రూపొందిన సినిమా కాదు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. చాలా మంది హీరోలు సిక్స్‌ప్యాక్‌ను అద్భుతంగా చూపించారు. నాకు సిక్స్ ప్యాక్ పూర్తిగా రాలేదు. అలా పూర్తిగా వ‌చ్చిన‌ప్పుడు సిక్స్ ప్యాక్ చూపిస్తామ‌ని ఆగాను. ఓ స్టేజ్‌లో నేను సినిమాల‌పై ఫోక‌స్ పెట్ట‌లేదు. చాలా సినిమాల‌ను నేను ముందు చూడ‌కుండా థియేట‌ర్‌లోనే చూసుకున్నాను. ఇక‌పై అలా కాకుండా ఓ ఫేజ్‌లో వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఈ ఏడాది `శ‌మంత‌క‌మ‌ణి`, ఇప్పుడు `బాల‌కృష్ణుడు` చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ రెండు చిత్రాలు కాకుండా `వీర‌భోగ వ‌సంత‌రాయులు` సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసేశాను. నా స్నేహితుడు శ్రీవిష్ణు న‌టించిన `మెంట‌ల్ మ‌దిలో` సినిమా కూడా ఈ నెల 24నే విడుద‌లవుతుంది. అయితే రెండు డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌. మెంట‌ల్ మ‌దిలో క్యూట్ ల‌వ్‌స్టోరీ అయితే, బాల‌కృష్ణుడు మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా. రెండింటికీ చాలా తేడా ఉంది. మ‌ణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన సంగీతం, నేప‌థ్య సంగీతం అందించారు. రెజీనా పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంటుంది. కాస్త టామ్ బాయ్‌లా క‌నిపించే పాత్ర‌. అన‌కున్న స్థాయిలో రీచ్ కావ‌డం లేద‌నే అసంతృప్తి అయితే ఉంది. నేను చేసిన సినిమాలు ప‌ర్టికుల‌ర్ సెక్ష‌న్ ఆడియెన్స్‌కే ప‌రిమితం అవ‌తున్నాయి. ప‌రుచూరి ముర‌ళిగారి ద‌ర్శ‌క‌త్వంలో `ఆట‌గాళ్లు` అనే థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్నాను. అలాగే ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో హార‌ర్ జోన‌ర్‌లో భీముడు అనే సినిమా చేయ‌బోతున్నాను. ఇవీ గాక ఓ క‌మ‌ర్షియ‌ల్ మూవీ, ల‌వ్ స్టోరీ చేయ‌బోతున్నాను. సినిమాల‌న్నీ స్క్రిప్టింగ్ ద‌శ‌లోనే ఉన్నాయి.చైతుతో కూడా క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నాను. అది వ‌చ్చే ఏడాది ఉండొచ్చు. ఇక నా నిర్మాణ సంస్థ‌లో శ్రీవిష్ణుతో కలిసి `నీది నాది ఒకే క‌థ‌` సినిమా చేస్తున్నాను. ఈ సినిమాను డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్స్ చేస్తున్నాం. ఇందులో ఓ కీల‌కమైన పాత్ర‌లో క‌నిపిస్తాను`` అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved