pizza
Mani Ratnam’s ‘Nawab’ To Release on September 27
సెప్టెంబర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా `న‌వాబ్` విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

11 September 2018
Hyderabad

Legendary Director Mani Ratnam is back with ‘Nawab’, a crime thriller, which is set against the the family backdrop and deals with today’s struggles in relationships. Makers of ‘Nawab’ announced that the the film will hit the screens across the globe on September 27, 2018.

Nawab has got a huge star cast that includes Arvind Swami, Vijay Sethupathi, Jyothika, Simbhu, Arun Vijay, Aishwarya Rajesh & Aditi Rao Hydari etc in the lead roles along with Jayasudha & Prakash Raj in pivotal roles. The music of this film is composed by AR Rahman & Santosh Sivan is the cinematographer.

Mani Ratnam & Subaskaran are jointly producing ‘Nawab’ under Madras Talkies & Lyca Productions banners.

సెప్టెంబర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా `న‌వాబ్` విడుద‌ల‌

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కున్న ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈయ‌న డైరెక్ష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `న‌వాబ్‌`. లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళంలోసెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ సంస్థ‌ల ప్ర‌తినిధులు మాట్లాడుతూ - ``న‌వాబ్ సినిమాను సెప్టెంబర్ 27న తెలుగు, త‌మిళ భాషల్లో గ్రాండ్‌రిలీజ్ చేస్తున్నాం. ముందుగా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ ... తాజాగా ఓ రోజు ముందుగానే అంటే సెప్టెంబ‌ర్ 27నే సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నాంరీసెంట్‌గా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌ణిర‌త్నంగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌వాబ్‌`మంచి యాక్ష‌న్ ప్యాక్‌డ్ మూవీ. ఎమోష‌నల్ కంటెంట్‌తో సాగే చిత్ర‌మిది. అర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్ వంటి భారీ తారాగ‌ణంతో , ఎ.ఆర్‌.రెహమాన్‌, సంతోశ్ శివ‌న్‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి టాప్ టెక్నీషియ‌న్స్ స‌హ‌కారంతో తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉటుంద‌నడంలో సందేహం లేదు`` అన్నారు.
ర‌వింద స్వామి, జ్యోతిక‌, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోశ్ శివ‌న్‌, ఎడిటింగ్‌: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌, పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, మాట‌లు: కిర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ‌ర్మిష్ట రాయ్‌, కాస్ట్యూమ్స్: ల‌క్హానీ, యాక్ష‌న్‌: దిలీప్ సుబ్బరాయ‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శివ ఆనంది, ర‌చ‌న‌: మ‌ణిర‌త్నం, శివ ఆనంది, నిర్మాత‌లు: మ‌ణిర‌త్నం, సుభాష్ క‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ణిర‌త్నం.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved