pizza
Nayanathara Latest Horror Flick Shooting in Progress
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నయనతార తాజా చిత్రం !!
You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2016
Hyderaba
d

ఈ చిత్రం భయపెట్టేటట్లుగా సమీప భవిష్యత్తులో మరే చిత్రం భయపెట్టలేదేమో. ఈ చిత్రం తర్వాత మరో హారర్ సినిమా నేను వెంటనే చేయకపోవచ్చు" అంటోంది నయనానందకరతార నయనతార. "మయూరి" చిత్రంతో ఒక మోస్తరుగా భయపెట్టిన ఈ అందాల రాక్షసి ఇంకా పేరు పెట్టని తన తాజా చిత్రంతో మరింత భయపెదతానని భరోసా ఇస్తోంది. అవుట్ అండ్ అవుట్ హారర్ ఎంటర్ టైనర్ గా.. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

మానస్ రుషి ఎంటర్ ప్రైజస్ పతాకంపై కె. రోహిత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సజ్జూభాయ్-రాంప్రసాద్ సహ నిర్మాతలు. "నయనతార కెరీర్ లో కలికితురాయిగా నిలిచే చిత్రమిది. గ్రాఫిక్స్ కి చాలా ప్రాధాన్యముంటుంది" అని నిర్మాత కె.రోహిత్ అన్నారు.

తంబిరామయ్య, హరీష్ ఉత్తమన్, మన్సూర్ ఆలీఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్లిన్, చాయాగ్రహణం: దినేష్ కృష్ణన్, ఎడిటింగ్: గోపికృష్ణ, సహ నిర్మాతలు: సజ్జూభాయ్-రాంప్రసాద్, నిర్మాత: కె. రోహిత్, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: మురుగదాస్ రామస్వామి!!

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved