pizza
Nenu Naa Premakatha release on 27 November
న‌వంబ‌ర్ 27న విడుద‌ల‌వుతున్న ‘నేను..నా ప్రేమ‌క‌థ‌’
You are at idlebrain.com > news today >
Follow Us

19 November 2015
Hyderabad

కె.ఎన్‌.రావ్ స‌మ‌ర్ప‌ణ‌లో శాస్టా మీడియాస్‌, ద‌త్తాత్రేయ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై శేఖ‌ర్‌, సుష్మ‌, డ‌యానా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం నేను..నా ప్రేమ‌క‌థ‌. వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌కత్వంలో వ‌ర్మ‌, ప‌ణుకు ర‌మేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సినిమా న‌వంబ‌ర్ 27న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ ‘’గుడ్ ల‌వ్ స్టోరి. ద‌ర్శ‌కుడు వ‌ర్ధ‌న్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. శేఖ‌ర్‌, సుష్మ‌, డ‌యానాలు చ‌క్క‌గా న‌టించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చిన్ని చ‌ర‌ణ్‌, ఎం.ఎస్‌.మిథున్‌లు సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్యూర్ ల‌వ్‌స్టోరి. ల‌వ్‌తో పాటు అన్నీ ర‌కాల ఎమోష‌న్స్ ఉన్న చిత్ర‌మిది. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

ఎమ్మెస్ నారాయ‌ణ‌, అంబ‌టి శీను, న‌వీన్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి కెమెరాః న‌గేష్ ఆచార్య‌, డ్యాన్స్ః విద్యాసాగ‌ర్‌, కిర‌ణ్‌, నిర్మాత‌లుః వ‌ర్మ‌, ప‌ణుకు ర‌మేష్ బాబు, ద‌ర్శ‌క‌త్వం: వ‌ర్ధ‌న్‌.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved