pizza
Dorasani News
ఆసక్తిరేపుతున్న దొరసాని
You are at idlebrain.com > news today >
Follow Us

26 May 2019
Hyderabad

ఆసక్తిరేపుతున్న దొరసాని

యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని తో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు.

ఈ సినిమా ప్రీ లుక్ రీలజ్ అయి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ రాజు పాత్రతో ఈసినిమా లో పరిచయం కాబోతున్నాడు. ఈ రాజు పాత్ర అతని కెరియర్ మీద కూడా మంచి ఇంపాక్ట్ ని చూపించబోతుంది. చూడటానికి సహాజంగా అనిపించే ఆనంద్ దేవరకొండ లో చాలా విషయం ఉందని అతనితో పనిచేసిన టీం అంటుంది. ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో రాజు పాత్రకు ఆనంద్ దేవరకొండ పూర్తి న్యాయం చేసాడని టీం అంటుంది. దొరసారి ఫస్ట్ లుక్ మే 30న విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్. ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక నటిస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే ఆనంద్ దేవరకొండ పేరు ఇండస్ట్ర్రీలో బాగా వినిపిస్తుంది.

సినిమా కూడా చాలా సహాజంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. కాలాలు మారినా ప్రేమ కథలు ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటాయి. ఈ పిరాయడిక్ ప్రేమ కథ మేకింగ్ టైమ్ నుండే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved