pizza
*Sri Venkateswara Cine Chitra LLP announces massive action entertainer with Hero Nikhil & Director Sudheer Varma*
హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

15 October 2021
Hyderabad


A huge action entertainer was today announced in the combination of actor Nikhil, who has been enjoying hits in a row, and versatile director Sudheer Varma, who is known for a variety of movies. Prominent production house Sri Venkateswara Cine Chitra LLP is producing it as its 32nd movie. Senior and uncomrpomising producer BVSN Prasad is proud to bankroll it, having already made a name for himself as the producer of a number of super hits.

After 'Swamy Ra Ra' and 'Keshava', this is the third film in the combination of the successful combo, Nikhil and Sudheer Varma. The project will go on the floors on October 25. The first schedule will be canned in London for 40 days. The high-octane actioner has music by Karthik. The cinematography is by Richard Prasad. The details of the rest of the cast and crew will be made official soon.

వ‌రుస విజయాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా, వైవిధ్య‌మైన చిత్రాల‌ను స్టైలిష్‌గా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొంద‌నుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 32వ చిత్ర‌మిది. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను అందించిన నిర్మాత‌గా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న సీనియ‌ర్ అండ్ అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘స్వామిరారా, కేశ‌వ’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ కాంబో హీరో నిఖిల్‌, డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మల క‌ల‌యిక‌లో రూపొందుతున్న మూడో చిత్ర‌మిది. అక్టోబ‌ర్ 25 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్‌ను నలబై రోజుల పాటు లండ‌న్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు కార్తీక్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర నటీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేశారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved