pizza
Ninne Korukunta music launch on 7 November
You are at idlebrain.com > news today >
Follow Us

23 October 2015
Hyderabad

నవంబర్ 7న ‘నిన్నే కోరుకుంటా’ ఆడియో

శుభకరి క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ భాస్కర్, ఆనంద్ రాజ్, సందీప్, పూజిత,సారిక హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ’నిన్నే కోరుకుంటా‘. గణ మురళి దర్శకత్వంలో విద్యాసాగర్ మరిపి(వినయ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నవంబర్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...

చిత్రనిర్మాత విద్యాసాగర్ మరిపి(వినయ్) మాట్లాడుతూ ’’ప్రస్తుతం జరుగుతున్న యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ కామెడిగా రూపొందుతోన్న చిత్రమే ‘నిన్నే కోరుకుంటా’. గణమురళి ఈ చిత్రాన్ని చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తుంది. ప్రణవ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నవంబర్ 7న విడుదల చేయాలనుకుంటున్నాం. కొండవలస, వైజాగ్ ప్రసాద్, అంబటి శ్రీను, చమ్మక్ చంద్ర తదితరుల సపోర్ట్ తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం .పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, మొదటి కాపీ సిద్దంగా వుంది . త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం‘‘ అన్నారు.

కొండ వలస, వైజాగ్ ప్రసాద్, అంబటి శ్రీను, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి, రాపిట్ అప్పారావు, ప్రసన్నకుమార్, ప్రదీప్, ఎఫ్.ఎం.బాబాయ్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: సాహు, బిట్ర ప్రకాష్, సాహిత్యం: పోతుల రవికిరణ్, కులశేఖర్, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: రామ్ కుమార్, మ్యూజిక్: ప్రణవ్, నిర్మాత: విద్యాసాగర్ మరపి(వినయ్), డైరెక్టర్: గణమురళి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved