pizza
Natural Star Nani, Danayya D.V.V's 'Ninnu Kori' To Release On July 7th
జూలై 7న నేచురల్‌ స్టార్‌ నాని, దానయ్య డి.వి.వి.ల 'నిన్ను కోరి'
You are at idlebrain.com > news today >
Follow Us

3 June 2017
Hyderabad

Natural Star Nani who is on a successful streak with back to back hit films like Yevade Subrahmanium, Bhale Bhale Magadivoi, Krishna Gadi Veera Prema Gadha, Gentleman, Majnu, and Ninnu Local is getting ready with new film Ninnu Kori. DVV Danayya produces the movie which is currently in post-production stages. As the movie is gearing up for worldwide release on July 7, this is what the unit has to say.

Another Good Film For Me
Natural Star Nani speaking about the movie said, “It is made on an interesting point in an entertaining way. I felt really happy working with Aadi in this film. It will be another good movie in my career”.

Another Super Hit On My Banner
Producer DVV Danayya said,” This is the first movie with Nani. We shot major portion of the movie in the US as per the demand of the story. There were also schedules in Hyderabad and Vizag. Entire shoot is completed and currently post production works are happening. Recently we released a song “Adiga Adiga” which has got tremendous response. the rest of the songs will also be blockbuster. Gopi Sundar has given wonderful music. We are planning to release Ninnu Kori worldwide on July 7. We are hopeful that this will be another big hit in the career of Nani”.

It Will Be A Big Plus To My Career
Actor Aadhi Pinishetty who plays a special role in the movie says that, “After the super hits of Malupu and Sarrainodu, this is my next film. It really felt happy working with Nani. I liked the subject narrated by Shiva and the way my character has been designed. Ninnu Kori will be a big plus to my career”.

Screenplay Based Subject
Writer Kona Venkat said, “It is made on a novel point and is a screenplay based movie. There will be entertainment galore along with all other elements. Ninnu Kori will be another super hit for Nani”.

Excited To Watch The Movie
Heroine Nivetha Thomas said, “I am working with Nani again after Gentleman. It was a really nice working experience with so much fun all around. I am eagerly waiting to watch the movie”.

Made On A Sensible Point
Debutant director Shiva Nirvana said, “Ninnu Kori is based on a sensitive point and we have tries to make it with good entertainment. Kona Venkat’s screenplay added great depth to the subject. Thanks to every artist and technicians co-operation we have completed the shoot on time. The movie has come out as I imagined. I felt really happy working in a big banner of Danayya Garu and with such amazing technicians”.

Natural Star Nani, Nivetha Thomas are playing as Hero, Heroines while Aadi Pinisetty will be seen in a crucial role.
Other Principle cast involves Murali Sharma, Thaikella Bharani, Prudhvi, Rajasree Nayar, Neethu, Bhoopal Raj, Kedar Shankar, Padmaja, Priyanka Naidu, Master Nehanth

Screenplay, Dialogues : Kona Venkat, Music : Gopi Sundar, Cinematography : Kartheek Ghattamaneni, Art : Chinna,
Styling : Neeraja Kona, Lyrics : Ramajogayya Sastry, Sreejo, Co-Director : Lakshman Musuluri, Production Controller : Sathyam Guggila, Producer : Danayya D.V.V, Story-Direction : Siva Nirvana.

జూలై 7న నేచురల్‌ స్టార్‌ నాని, దానయ్య డి.వి.వి.ల 'నిన్ను కోరి'

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను లోకల్‌ వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న 'నిన్నుకోరి' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్‌ సాంగ్‌ 'అడిగా అడిగా.. ఎదలో లయలడిగా'కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

ఈ చిత్రం గురించి నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో సినిమా అంతా ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. ఈ చిత్రంలో ఆదితో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. 'నిన్నుకోరి' నాకు మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''నానితో ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్న సినిమా ఇది. కథకు అనుగుణంగా సినిమాలోని ఎక్కువ శాతం షూటింగ్‌ అమెరికాలోనే చెయ్యడం జరిగింది. అలాగే హైదరాబాద్‌, వైజాగ్‌లో కూడా షెడ్యూల్స్‌ చేశాం. టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల రిలీజ్‌ చేసిన 'అడిగా అడిగా ఎదలో లయలడిగా..' సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. గోపీసుందర్‌ అన్నీ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. వరసగా సూపర్‌హిట్‌ సినిమాలు చేస్తున్న నానికి 'నిన్నుకోరి' మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ మూవీ ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7 వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న యంగ్‌ హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ''మలుపు, సరైనోడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా ఇది. నానితో కలిసి వర్క్‌ చెయ్యడం చాలా హ్యాపీగా అనిపించింది. శివ చెప్పిన సబ్జెక్ట్‌ నాకు బాగా నచ్చింది. ఇందులో నా క్యారెక్టర్‌ని డిజైన్‌ చేసిన విధానం కూడా బాగుంది. ఈ సినిమా నా కెరీర్‌కి మంచి ప్లస్‌ అవుతుంది'' అన్నారు.

కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''ఒక కొత్త పాయింట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సబ్జెక్ట్‌ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. నానికి 'నిన్నుకోరి' మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

హీరోయిన్‌ నివేథా థామస్‌ మాట్లాడుతూ - ''జెంటిల్‌మన్‌ తర్వాత నానితో మళ్ళీ వర్క్‌ చెయ్యడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అనే ఎక్సైట్‌మెంట్‌తో వున్నాను'' అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ''ఒక సెన్సిబుల్‌ పాయింట్‌ని తీసుకొని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. కోన వెంకట్‌గారి స్క్రీన్‌ప్లే ఈ కథకు మంచి గ్రిప్‌ ఇచ్చింది. నేను అనుకున్నట్టుగానే సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ సహకారంతో షూటింగ్‌ పూర్తి చెయ్యగలిగాం. దానయ్యగారులాంటి పెద్ద ప్రొడ్యూసర్‌ బేనర్‌లో ఇంత మంచి టీమ్‌తో వర్క్‌ చెయ్యడం చాలా సంతోషాన్ని కలిగించింది'' అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved