pizza
Nithiin, Shalini Wedding In Hyderabad On July 26th
జూలై 26న హైద‌రాబాద్‌లో నితిన్‌, షాలిని వివాహం
You are at idlebrain.com > news today >
 
Follow Us

18 July
Hyderabad


 

Hero Nithiin who is enjoying the success of Bheeshma is all set to enter into wedlock. He will tie the knot with Shalini on July 26th at 8:30 PM in Hyderabad, following the guidelines imposed by the government. Only family members and close friends will attend the wedding ceremony.

It is known that, Nithiin and Shalini’s Pasupu Kumkuma function was held in February.

Nithiin is presently starring in Range De and Check. He has also lined up Andhadhun remake with Merlapaka Gandhi and Power Peta with Krishna Chaitanya.

 

'భీష్మ' మూవీ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ వ‌చ్చిన హీరో నితిన్ వివాహానికి సిద్ధ‌మ‌వుతున్నారు. జూలై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌వారు, స‌న్నిహిత స్నేహితులు హాజ‌ర‌వ‌నున్నారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం నితిన్ 'రంగ్ దే', 'చెక్' అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ త‌ర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో 'అంధాధున్' రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో 'ప‌వ‌ర్ పేట' సినిమాలు చేయ‌నున్నారు.

 

 

 


 

 


 

 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved